2016 లో దేశ వ్యాపంగా లక్షన్నరకు పైగా రోడ్డు ప్రమాదాల్లో మృతి. రోజుకు సగటున 400 మంది మృతి చెందారు. తమిళనాడులో అత్యధికం, ఆంధ్రకు 5వ తెలంగాణకు 7వ స్థానం.

గత సంవత్సరంలో దేశ వ్యాప్తంగా లక్షన్నర మంది రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు కేంద్రం తెలిపింది. గంట‌కు 17 మంది చొప్పున వాహనధారులు ప్రమాదాల్లో మృతి చెందారని తాజా ప్రకటనలో పేర్కొంది. రోజుకు సగటున 400 మంది మృతి చెందారని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలపై తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఓ ప్రకటన విడుదల చేశారు. గంటకు 55 రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో 17 మంది మరణిస్తున్నారని తెలిపారు. మృతి చెందిన వారిలో సగానికిపైగా 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్కులే అని తెలిపారు.

మంత్రి చేసిన ప్రకటనలో వివరాలు ఇలా ఉన్నాయి.. 2016 సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా 4,80,785 ప్రమాదాలు జరిగాయని, అందులో 1,50,785 మంది మృతి చెందారని, దాదాపుగా 5 లక్షల మంది గాయాల బారిన పడ్డట్లు స్ఫష్టం చేశారు. అయితే 2015 సంవత్సరంలో కన్న రోడ్డు ప్రమాదాలు 4.1 శాతం తగ్గాయని, మరణాలు మాత్రం 3.2 శాతం పెరిగిందని పేర్కోన్నారు.

అయితే ఈ ప్రమాదాల్లో అత్యధికంగా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోనే 86శాతం ఉందని ఆయన తెలిపారు. తమిళనాడులో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ కి 5వ స్థానం, తెలంగాణకి 7వ స్థానంలో నిలిచాయి. జరిగిన ప్రమాదాల్లో 94శాతం డ్రైవర్ల నిర్లక్ష్యంగానే జరిగాయని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి..