Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లోకి మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ఫీచర్లు అదిరిపోయాయి
Honor 7A With Face Unlock, 18:9 Display, Dual Rear Cameras Launched: Price, Specifications, Features

హువావే సంస్థ తన నూతన స్మార్ట్‌ ఫోన్ హానర్ 7ఎ ను చైనా మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్ విడుదల కానుంది. రూ.8,250 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. ఇందులో 5.77 ఇంచుల సైజ్ ఉన్న భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న రెండు కెమెరాలను అమర్చారు. ముందు భాగంలో ఉన్న 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాకు ఫ్లాష్ సదుపాయం ఇచ్చారు. ఈ ఫోన్‌లో మెమొరీ కార్డు కోసం ప్రత్యేకంగా డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు. వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 

ఫీచర్లు..

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

Follow Us:
Download App:
  • android
  • ios