బంగారం మళ్లీ పైకెగిసింది. కొనుగోలుదారుల నుంచి డిమాండ్  పెరగడంతో  శనివారం బంగారం ధర రు.190 పెరిగింది. 

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. స్థానిక ఆభరణ వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలు శనివారం బులియన్‌ మార్కెట్‌లో 190 రూపాయలు పెరిగాయి. రూ.29వేల కిందకు పడిపోయిన 10 గ్రాముల బంగారం ధర దీనితో రూ.29వేలు దాటింది. చివరకు రూ.29,050 వద్ద నిలబడింది. వెండి కూడా 38వేల రూపాయలకు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక యూనిట్ల నుంచి కొనుగోళ్లు పెరగడంతో వెండి కూడా వూపందుకుంది.

రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన 99.9 శాతం, 99.5 శాతం రకాల బంగారం ధర పది గ్రాములకు రూ.190 రూపాయలు పెరిగి, 29,050 రూపాయలు, 28,900 రూపాయలు ఉంది. నిన్న బంగారం ధర 190 రూపాయలు పడిపోయిన సంగతి తెలిసిందే.