మూడు కొత్త మోడల్ బైక్ లను విడుదల చేసిన హీరో మోటార్స్ 2018లో ధర ప్రకటించనున్న కంపెనీ

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటార్స్.. మరో మూడు ద్విచక్రవాహనాలను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఐ3ఎస్‌ టెక్నాలజీతో అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా వీటిని అందుబాటులోకి తెచ్చింది. అయితే జనవరి 2018 లోవీటి ధర ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. సూపర్‌ స్ల్పెండర్‌ లో 125 సీసీ ఇంజీన్‌, పాషన్‌ ప్రో, పాషన్‌ ఎక్స్‌ ప్రో మోడల్స్‌ లో 110 సీసీ ఇంజీన్‌ను పొందుపర్చింది.

సూపర్‌ స్ల్పెండర్‌లో ఎయిర్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌, ఆటోమ్యాటిక్‌ హెడ్‌ ల్యాంప్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, వైడర్‌ రియర్‌ టైర్‌, సీటు కింద ఎక్కువ ప్లేస్‌ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. పాషన్‌ ప్రో, ఎక్స్‌ ప్రోలో ఆటోమ్యాటిక్‌ హెడ్‌ ల్యాంప్‌తోపాటు ఫ్యూయల్‌ లెవల్‌, ట్రిప్‌ మీటర్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ తదితర వివరాలు అందించేలా డిజిటల్‌​ అన్‌లాగ్‌ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపర్చింది. అయితే పాషన్‌ ప్రోతో పోలిస్తే ఎక్స్‌ ప్రోను స్టయిలిష్‌గా తీర్చిదిద్దింది. స్కల్‌ప్‌డ్‌ ఫ్యూయల్‌ ఇంధన ట్యాంక్, డబుల్‌ టోన్ రియర్‌ మిర్రర్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్‌ అమర్చింది.