నిరుద్యోగులకు శుభవార్త

good news for unemployement people in telugu states
Highlights

  • నిరుద్యోగులకు శుభవార్త
  • పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఆర్బీఐ
  • కనీస విద్యార్హత పదోతరగతి

నిరుద్యోగులకు నిజంగా ఇది శుభవార్తే. కేవలం పదోతరగతి పాస్ అయ్యి ఉంటే చాలు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సంపాధించవచ్చు. దేశవ్యాప్తంగా 526 ఆఫీసు అటెండెట్ పోస్టుల భర్తీ కోసం ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ ఆఫీసులో 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా ముంబయి ఆఫీసులో 165, రెండో అత్యధిక సంఖ్యలో బెంగళూరు ఆఫీసులో 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది.

రిజిస్ట్రేషన్ కి డిసెంబర్ 7వ తేదీ ఆఖరి రోజు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు ఆన్ లైన్ పరీక్ష ఉంటుంది. నవంబర్ 1వతేదీ 2017 నాటికి 18 ఏళ్లు నిండి, 25ఏళ్లలోపు వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి ఐదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు, పీడబ్ల్యూడీ వాళ్లకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది. కనీస విద్యార్హత పదోతరగతి పాస్ అయ్యి ఉండాలి. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం www.rbi.org.in వెబ్ సైట్ లో చూడవచ్చు.

loader