Asianet News TeluguAsianet News Telugu

‘ గోల్డెన్ పికాక్’ అవార్డులను అందుకున్న చంద్రబాబు దంపతులు

  • చంద్రబాబు దంపతులను వరించిన గోల్డెన్ పికాక్ అవార్డు  
  • బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్  చేతుల మీదుగా అవార్డు అందుకున్న చంద్రబాబు
golden peacock award for cm chandrababu couple

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి లు ప్రతిష్టాత్మక ‘ గోల్డెన్ పికాక్’ అవార్డును అందుకున్నారు. పబ్లిక్ అండ్ ఎకనామిక్ ట్రన్సఫర్మేషన్ విభాగంలో చంద్రబాబు ఈ అవార్డు అందుకున్నారు. లండన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ చంద్రబాబుకి అవార్డును అందజేశారు.

ఇదే వేదికపై చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా అవార్డును అందుకున్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ పబ్లిక్ సెక్టార్ విభాగంలో భువనేశ్వరికి ఈ అవార్డు వరించింది. హెరిటేజ్ సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఆమె ఈ అవార్డు అందుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios