మూడు వారాల కనిష్టస్థాయికి తగ్గిన ధరలు

పసిడి కొనుగోలు దారులకు శుభవార్త. గత రెండు వారాల నుంచి భారీగా పెరుగతూ వస్తోన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఒక్క బంగారమే కాదు వెండి ధర కూడా అదే స్థాయిలో పతనమైంది.

ఈ రోజు బంగారం , వెండిధరలు మూడువారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బంగారు షాపుల యజమానుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అలాగే పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈరోజు బంగారం ధర రూ. 400, వెండి ధర రూ. 490 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.29,500, కిలో వెండి రూ.42,250 పలుకుతోంది.