అదిరిపోయే ఫీచర్లతో జియోని నుంచి మరో స్మార్ట్ ఫోన్

Gionee S10 Lite  Launched in India
Highlights

  • ఎస్10లైట్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ నలుపు, గోల్డ్ కలర్స్ లో లభ్యం కానున్నాయి.
  • దీని ధర రూ.15,999గా ప్రకటించారు.
  • శనివారం నుంచి ఈ ఫోన్.. వినియోగదారులకు లభ్యం కానుంది.

ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ జియోని.. భారత మార్కెట్ లోకి శుక్రవారం మరో ఫోన్ ని విడుదల చేసింది. ఎస్10లైట్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ నలుపు, గోల్డ్ కలర్స్ లో లభ్యం కానున్నాయి. దీని ధర రూ.15,999గా ప్రకటించారు. శనివారం నుంచి ఈ ఫోన్.. వినియోగదారులకు లభ్యం కానుంది. ఎస్‌10 లైట్‌ సెల్ఫీ కెమెరాతో గ్రూప్‌ సెల్ఫీ, బొకె సెల్ఫీలు తీసుకోవచ్చు. వాట్సాప్ క్లోన్‌ ఫీచర్‌లో మూడు అకౌంట్లు వినియోగించుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌ ఓఎస్‌తో పని చేసే ఈ మొబైల్‌తో అత్యద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చునని జియోనీ ఇండియా గ్లోబల్‌ సేల్స్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ చాంగ్‌ తెలిపారు.

ఫోన్ ఫీచర్లు..

5.2 అంగుళాల డిస్‌ప్లే
16 ఎంపీ ఫ్లాష్‌ సెల్ఫీ ఫ్రంట్‌ కెమెరా
13 ఎంపీ రియర్‌ ఆటో ఫోకస్‌ కెమెరా
3100 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఎంఎస్‌ఎం8920 ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌
32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ (256 జీబీ దాకా పెంచుకునే సామర్థ్యం)
ఆండ్రాయిడ్‌ 7.1 నౌగట్‌ ఓఎస్‌(జియోనీ అమిగో 4.0 ఓస్‌)
ఫోన్‌ బరువు 155 గ్రాములు

loader