Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగి సూసైడ్... నలుగురిపై వేటు

  • ఆత్మహత్యకు పాల్పడిన ఉద్యోగి
  • కేసును సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం
  • నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
four officials suspended by the  government over the employee sucide case

గుంటూరు వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రవికుమార్ ఆత్మహత్య కేసులో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. రవికుమార్  ఆత్మహత్య చేసుకోవడానికి కారకులుగా భావించి.. నలుగురు అధికారులు రత్నం రాజు, మల్లికార్జున రావు, భానుమూర్తి, ప్రసాద్ లపై వేటు వేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం  మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.

ప్రమోషన్ ను అడ్డుకుంటున్నారన్న ఆరోపిస్తూ రవికుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన చనిపోయే ముందు.. తన ఆత్మహత్యకు గల కారణాలను తెలియజేస్తూ సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. ఆ వీడియో ఆధారంగానే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. రవికుమార్ ప్రమోషన్ అడ్డుకోవడం, అతనిపై తీవ్ర ఒత్తిడి పెంచడానికి కారణమైన అధికారులపై శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. కాగా.. ఆ నలుగురు అధికారులను అరెస్టు చేయాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios