చిన్న రాజప్పా, సారీ అప్పా

First Published 29, Dec 2017, 4:22 PM IST
Forensic lab directo gandhi apologizes home minister Rajappa
Highlights

ముఖ్యమంత్రి జోక్యం తో క్షమాపణలు,  ఇది హోమ్ మంత్రి పరిస్థితి

అమరావతి: రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ క్షమాపణలు చెప్పారు. 

తుళ్లూరులో రూ. 150 కోట్లతో నిర్మించనున్న ఫోరెన్సిక్ ల్యాబ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేశారు. 

అయితే... ఈ కార్యక్రమానికి చినరాజప్పకు ఆహ్వానం పంపలేదు. దీనికి మనస్థాపం చెందిన హోంమంత్రి నిన్న విజయవాడలోనే ఉన్పప్పటికీ కార్యక్రమానికి హాజరుకాలేదు. 

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీయగా అసలు విషయం తెలుసుకుని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రిని అవమానపర్చడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. హెం మంత్రి లేని కార్యక్రమమేటని కూడా ఆయన అన్నట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా... చినరాజప్పకు సీఎం చంద్రబాబు శుక్రవారం ఫోన్ చేశారు. జరిగిన సంఘటనను తెలుసుకున్నానని, సాయంత్రం వచ్చి కలవాలని కోరారు.
 
కాగా జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, హోంమంత్రికి క్షమాపణ చెబుతున్నట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గాంధీ తెలిపారు

loader