ఈ ప్రేమ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా?

First Published 23, Dec 2017, 12:21 PM IST
florida love couple wedding in underwater
Highlights
  • ఫ్లోరిడాకి చెందిన ఓ జంట మాత్రం  అందరికన్నా భిన్నంగా వివాహం చేసుకోవాలనుకున్నారు

ప్రేమ ఒక అనిర్వచితమైన అనుభూతి. దానికి మరింత బలం చేకూర్చేది పెళ్లి. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు. అందుకే చాలా మంది రూ.లక్షలు ఖర్చు చేసి మరీ ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటారు. అయితే.. ఫ్లోరిడాకి చెందిన ఓ జంట మాత్రం  అందరికన్నా భిన్నంగా వివాహం చేసుకోవాలనుకున్నారు. అందుకే.. సముద్రం అడుగు భాగానా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాకు చెందిన థామస్ మౌల్డ్ ఒక ఆర్మీ అధికారి. 2013లో ఆర్మీ అడ్వెంచర్ ట్రిప్ లో భాగంగా థామస్.. డైవింగ్ ట్రిప్ కి వెళ్లాడు. అక్కడ సాండ్రా హైడే ఇన్ స్ట్రక్టర్ గా పనిచేస్తోంది. ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మలుచుకోవాలని ఇద్దరూ భావించారు. అంతేకాకుండా.. అందరికన్నా భిన్నంగా పెళ్లి చేసుకోవాలనుకున్నారు.  సాధారణంగా అందరూ చర్చిలో పెళ్లి చేసుకుంటారు. అయితే.. వీరు అందంగా ముస్తాబై నీటి మధ్యలో వివాహం చేసుకోవాలనుకున్నారు. ఎక్కడైతే వీరి ప్రేమ చిగురించిందో.. అక్కడే పెళ్లి ద్వారా ఒక్కటవ్వాలని భావించారు. అంతే.. ఇలా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.


 

loader