ఫ్లిప్ కార్ట్ మరో బంపర్ సేల్.. 80శాతం డిస్కౌంట్ ఆఫర్

First Published 5, May 2018, 1:56 PM IST
Flipkart Next Big Sale Begins on May 13, Flash Sales and Discounts on Mobiles Likely
Highlights

షాపింగ్ డేస్ సేల్ అంటున్న ఫ్లిప్ కార్ట్

ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరోసారి ఆఫర్ల వర్షం కురిపించేందుకు సిద్ధమయ్యింది. ఈ నెల 13 నుంచి 16 వరకు నాలుగు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ఉండనుంది. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టీవీలపై భారీ ఆఫర్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నది. అతి తక్కువ ధరలకే స్మార్ట్‌ఫోన్లను అందించడంతోపాటు సెలక్టెడ్ డివైస్‌లపై ఫ్లాష్‌సేల్ నిర్వహించనుంది. ఇక డెబిట్, క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు, బజాజ్ ఫిన్‌సర్వ్ లిమిటెడ్, క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ, డెబిట్ కార్డులపై ఈఎంఐ, బయ్‌బ్యాక్ గ్యారెంటీలాంటి ఆఫర్లు కూడా ఇందులో ఉన్నాయి. 

ఈసారి గేమ్స్ కార్నర్‌ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో భాగంగా కేవలం రూపాయి పెట్టి గేమ్స్ ఆడి ల్యాప్‌టాప్స్, మొబైల్స్‌ను గెలుచుకునే అవకాశం ఫ్లిప్‌కార్ట్ కల్పించింది. అంతేకాదు బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో కొనుగోలు చేసిన ప్రోడక్ట్స్‌పై వంద శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఈ గేమ్స్ ద్వారా పొందవచ్చు. ఇక ల్యాప్‌టాప్స్, పవర్ బ్యాంక్స్, టాబ్లెట్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు డిస్కౌంట్లు ఉండనున్నాయి. టీవీలపై కూడా 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. 

loader