కాల్పలు జరిపిన పాడక్ పెద్ద జూదగాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. 30 ఏళ్ల కిందటే ఉద్యోగం ఊడింది. అతగాడి తండ్రి బ్యాంక్ దోపిడి నేరస్థుడు. శిక్షా కాలంలో జైలునుంచి పరారయ్యాడు

అమెరికా లాస్‌వెగాస్‌లో స్టీఫెన్ క్రయిగ్ పాడక్ అనే జూదగాడు నిన్న నరమేధం సృష్టించాడు. జేసన్‌ ఆల్డీన్‌ ఆ మ్యూజిక్‌ కన్సర్ట్‌ జరుగుతున్న ప్రదేశానికి పక్కనే ఉన్న ఒక హోటల్‌లోని 32వ అంతస్తులోని తన గదిలోని కిటికీ నుంచి అమాయక ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. సంగీతాన్ని ఆస్వాదిస్తున్న 59 మందిని పొట్టన పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో...(సోర్స్ సోషల్ మీడియా)