Asianet News TeluguAsianet News Telugu

ఆర్బీఐ లా సీబీఐ  నుంచీ 2 వేల నోటు

సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ అని అనుకోకండి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదెక్కడుంది. దీనికి రూ. 2 వేల నోటు ముద్రించే అధికారం ఎవరు ఇచ్చారు అని ఆశ్చర్యపోకండి.

Fake Rs 2000 notes of  Children Bank of Indiadispensed from ATM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే దేశంలో రూ. 2 వేల నోటు ముద్రిస్తుందని మనందరికీ తెలిసిందే. అయితే సీబీఐ కూడా రూ. 2 వేల నోటు ముద్రిస్తోందని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది.

సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ అని అనుకోకండి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదెక్కడుంది. దీనికి రూ. 2 వేల నోటు ముద్రించే అధికారం ఎవరు ఇచ్చారు అని ఆశ్చర్యపోకండి.

ఢిల్లీలోని సంఘం విహార్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో నుంచే  ఈ రూ. 2 వేల నకిలీ నోట్లు బయటకొచ్చాయి.

కాకపోతే రిజర్వ్ బ్యాంక్ అని ఉండాల్సిన చోట భారతీయ మనోరంజన్ బ్యాంక్ అని ఉంది. సీరియల్ నెంబర్ ఉండాల్సిన చోట అన్నీ సున్నాలే ఉన్నాయి. మూడు సింహాలు ఉండాల్సిన చోట చూరణ్ లేబుల్ ఉంది.

సెంట్రల్ గర్నమెంట్ గ్యారంటీ అని ఉండాల్సిన చోట చిల్డ్రన్స్ గ్యారెంటీ అని ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios