Asianet News TeluguAsianet News Telugu

బొటన వేలు పొడవుగల మొబైల్ ఫోన్

  • ప్రపంచంలో కెల్లా అతి చిన్న మొబైల్ ఫోన్
  • రూపాయి కాయిన్ కన్నా తక్కువ బరుగల ఫోన్
did you see the worlds smallest mobile phone Zanco tiny t1

ప్రపంచంలో కెల్లా అతి చిన్న ఫోన్ ని చూశారా..?  యూకేకి చెందిన జాన్కో అనే కంపెనీ ఈ ఫోన్ ని తాజాగా విడుదల చేసింది. దీని పొడవు ఎంతో తెలుసా.. సరిగ్గా మన చేతి బొటన వేలు పొడవంత ఉంటుంది. అంతేకాదు ఒక కాయిన్‌ కంటే తక్కువ బరువు వుంటుంది. కేవలం 13 గ్రాములు.  ఇందులో  సింగిల్ నానో సిమ్ వేసుకోవచ్చు.  జాన్కో టైనీ టై1 పేరుతో ఈ ఫోన్ ని తయారు చేశారు.

did you see the worlds smallest mobile phone Zanco tiny t1

 ఫోన్‌ బుక్‌లో 300 కాంటాక్ట్స్, 50 మెసేజ్‌లను,  50 కాల్‌లాగ్స్‌ ను మాత్రమే స్టోర్‌ చేసుకునే సదుపాయం కలదు. ఇంటర్నెట్ యాక్సెస్ లేని ఈ ఫోన్ ప్రపంచంలోని అన్ని దేశాల్లో 2018, మే నెలలో మార్కెట్‌లోకి రానుంది. ఇక రేటు విషయానికొస్తే  సుమారు రూ.2,500. ఇంత ప్రత్యేకమైన ఫోన్‌లో బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ, లౌడ్ స్పీకర్లు ఫీచర్లు  సహా ఇతర ఫీచర్లు  కూడా ప్రత్యేకంగానే ఉన్నాయి. ప్రస్తుత కాలంలో 6 ఇంచెస్, 7 ఇంచెస్ వెడల్పుగల టచ్ స్క్రీన్ ఫోన్లపై మాత్రమే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి తరుణంలో ఇలాంటి ఫోన్ ని విడుదల చేయాలనుకోవడం ఒకింత రిస్క్ అనే చెప్పవచ్చు.

టైనీ టై1 ఫోన్ ఫీచర్లు..

0.49 ఇంచ్ ఓ ఎల్ఈడీ డిస్‌ప్లే

32 x 64 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌

మీడియాటెక్ ఎంటీకే 6261డి మదర్‌బోర్డు

32 ఎంబీ స్టోరేజ్‌

200 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ, 3 రోజులు స్టాండ్‌బై, 180 నిమిషాల టాక్‌ టైం

Follow Us:
Download App:
  • android
  • ios