Asianet News TeluguAsianet News Telugu

తెలుగుదనం లేకుండా తెలుగు భాషను కాపాడలేం

ధోవతి చొక్కా వేసుకుని ఇంటర్వ్యూ కి వస్తేనే ఉద్యోగం ఇస్తామని గవర్న మెంట్ కండీషన్ పెట్టాలి. 

Develop Telugu personality before talking about Telugu language

తెలుగు భాష ప్రాధాన్యంత తగ్గిపోతున్నదని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తెలుగును తప్పసరి బోధనభాషగా  ప్రోత్సహించాలని  ప్రభుత్వం మీద వత్తడి తెస్తున్నారు. తెలుగు భాషమీద సాగుతున్న చర్చలో పాల్గొంటూ ఆందుకూరి శాస్త్రి  కొన్ని సూచనలు చేశారు. అదే ఈ వ్యాసం.

 

 

ముందర మన కట్టు బొట్టులో దేశీయత తీసుకొద్దాం . ఎందుకంటే తెలుగు భాష పూర్వ ఔన్నత్యం అన్నప్పుడు మనకు గిడుగు రామమూర్తి గారు కందుకూరి , గురజాడ ,రాయప్రోలు దేవులపల్లి జాషువా వీరందరూ మనసులో మెదులుతారు. వారందరు ధోవతులు చొక్కాలు ధరించిన వారే. \

శ్రీశ్రీ పాంట్స్ షర్ట్స్ వేసుకునేవాడే. తెలుగు భాషాభిమానం సాంప్రదాయ వేషభాషలతో మొదలవుతుంది. 

తెలుగు భాష ఔన్నత్యాన్ని పునరుద్ధరించాలనుకునే వారు ముందర ధోవతి చొక్కాలలోకి మారాలి వెంకయ్యనాయుడి గారల్లే. అయన ఉపరాష్ట్రపతి అయినా మారలేదు. సుభాష్ చంద్ర బోస్ కూడా మిగతా సమయంలో ధోవతి కట్టేవాడు. బెంగాలీ ధోవతి proverbial . 

ఇంట్లో గడపలకు పసుపు రాయటం, ఇంటిముందర ముగ్గులు , గుమ్మానికి తోరణాలు,,.. ఇవనీ లేకుండా ఒక్క తెలుగు భాష తెలుగు వాతావరణం సృష్టిస్తుందా ... తెలుగు పునరుద్ధరణ తెలుగు తనం తో రావాలి. ఇది నేను చెప్పింది.కాదు. . 

నన్నయ్య ఆంధ్ర శబ్ద చింతామణి లో చెప్పింది 

"స్వస్థాన వేషభాషాభి మతాస్సంతో రస ప్రలుబ్ధ ధియః లోకే బహుమన్యంతే వైకృత కావ్యానిచాన్యదపహాయ " ​. 

ఆయన భారతం ఎందుకు తెలుగు లోకి అనువదిస్తూ ఈ మాటంటాడు .స్వస్థానవేష భాషలు అభిమానించే జ్ఞానులు రస యుక్తం గాఉ న్నయ్యని తెలుగు కావ్యాలు కూడా చదువుతారు అని దీని అర్థం   భాషాభిమానం కేవలం ఒంటరిగా ఉంటె సరిపోదు . వేష భాషలు కూడా ఆజాతికి అనుగుణంగా ఉండాలి . పైగా స్వస్థానం అంటే ప్రేమ ఉండాలి. తెలుగు జాతి అని చెప్పుకోవాలంటే వేషం కూడా తెలుగు దే  ఉండాలి. 

నన్నయ్య ప్రకారం కూడా స్వస్థానం , అంటే పుట్టిన రాజ్యం లేక రాష్ట్రం ,వేషం ,భాషా ఉంటేనే తెలుగు ప్రోత్సాహానికి అర్థం ఉంది. 

భాష పెడుతున్న ఈ కండిషన్ ని అందరు ఒప్పుకోగాలరా . 

తెలుగు తనం మొత్తం కోసం పోట్లాడకుండా ఒక భాషకు మాత్రమే పోట్లాడటం పూర్తి పోరాటం కాదు రాజకీయం అవుతుంది .అందరు ధోవతులుచొక్కాలు ,  ఆడవాళ్ళూ చీరలు రవికెలు మాత్రమే ధరించాలనే ఉద్యమం కూడా రావాలి.  

ధోవతి చొక్కా వేసుకుని ఇంటర్వ్యూ కి వస్తేనే ఉద్యోగం ఇస్తామని గవర్న మెంట్ కండీషన్ పెట్టాలి. 

పెద్దలు కనపడం  గానే నమస్కారం చేయటం .బయటనుంచి వచ్చినపుడు కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి రావటం మొదల్లైనవి/   మన తెలుగు తనానికి చాలక్షణాలు ఉన్నయ్యి అవన్నీ చేయాలి. కవిత్వం అంటే  పద్యాలలోనే రాయాలి. వ్యాకరణం పాటించాలి. ఇవన్నీ తెలుగు తనానికి లక్షణాలు. 

Follow Us:
Download App:
  • android
  • ios