హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బండారు  పల్లి కోమలి (30) గురువారం  ఆత్మహత్య చేసుకుంది.తాను డిప్రెషన్ వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, దీనికి ఎవరూ బాధ్యులు కారని  ఆమె ఒక లేఖలో తెలిపింది.

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బండారు పల్లి కోమలి (30) గురువారం ఆత్మహత్య చేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గుంటూరు కు చెందిన కోమలికి అయిదేళ్ల కిందట భాస్కర్ రావు అనే మరొక సాఫ్ట్ వేర్ ఉద్యోగితో వివాహమయింది. వారు కూకట్ పల్లి ఫేజ్ 3 కాలనీలో ఒక ఫ్లాట్ లో నివాసం ఉంటున్నారు. గురువారం రాత్రి ఎనిమిది గంటలకు భాస్కర్రావు ఆఫీసు నుంచి ఇంటికొచ్చాడు. అయితే, బెడ్ రూం తలుపు లోపలినుంచి గడియ పెట్టి ఉండటం చూశాడు. తర్వాత ఇరుగుపొరుగు వారితో కలసి తలుపు పగులకొట్టి కి లోనికి ప్రవేశించారు. అయితే, బెడ్ రూంలో సీలింగ్ కు వురి వేసుకుని ఉంది. ఈ విషయాన్ని వెంటనే ఆయన కోమలి తల్లితండ్రులకు తెలియచేశాడు.

బెడ్ రూంలో పోలీసులకు ఒక ఆత్మహత్య లేఖ దొరింది. తాను డిప్రెషన్ వల్ల ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు, దీనికి ఎవరూ బాధ్యులు కారని ఆమె లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.