కట్టప్ప క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో బహుబలి రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.

నెటిజన్ల క్రియేటివిటీకి, సోషల్ మీడియా సెటైర్లకు ఆకాశమే హద్దు. ఒక్క ట్వీటుతో బోడిగుండుకు, మోకాలుకు కూడా లింక్ పెట్టగలరు.. ఒక్క ఫొటోతో సెలబ్రెటీలకే సెగలు పుట్టించగలరు.. ఒక్క పోస్టుతో సామన్యుడిని కూడా అసమాన్యుడిని చేయగలరు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఏ సెలబ్రెటీ అయినా ‘నెట్’ కెక్కారా ఇక అంతే సంగతలు... ఫేస్ బుక్ లో అతడికి పోస్టుమార్టం చేసేస్తారు. ట్వీటర్లో ఆయనపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు. వాట్సాప్ లో ఉతికి ఆరేస్తారు.

ఇలా సోషల్ మీడియాకు ఇటీవల బాహుబలి సినిమాలోని ‘కట్టప్ప’ అడ్డంగా దొరికిపోయారు. కావేరీ నదీజలాల విషయంపై తమిళ సినీ నటుడు సత్యరాజ్ ( కట్టప్ప) గతంలో కన్నడిగులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆ సెగ బాహుబలిపై పడింది.

కట్టప్ప క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో బహుబలి రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.

దీంతో ఆయన దిగివచ్చారు. కన్నడిగులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే ఈ వ్యవహారం నెట్ లో చర్చకు రావడంతో కట్టప్పపై జోకులు బాగానే పేలాయి. అందులో ఇదీ ఒకటి.

కట్టప్ప అచ్చంగా దక్షణాఫ్రికా క్రికెటర్ ఆమ్లా లాగే ఉన్నాడని సోషల్ మీడియా తీర్మానించింది... సాక్షంగా ఈ ఫొటో కూడా విడుదల చేసింది. పోలికలు చూసి చెప్పండి ఇద్దరూ బ్రదర్స్ లానే ఉన్నారు కదూ..!