బంపర్ ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

First Published 5, Sep 2017, 5:59 PM IST
BSNL release to new plane
Highlights
  • నూతన ప్లాన్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్.
  • మూడు నెలల ప్లాన్ తో ఎయిర్టెల్, జియో తో వార్ కి సిద్దం.
  • కెరళలో తప్ప మిగతా రాష్ట్రాలకు వర్తింపు

 బీఎస్ఎన్ఎల్ అదిరిపోయో ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో దూసుకెళ్తున్న రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ సంస్థల ఆఫర్లకు ధీటుగా కొత్త ప్లాన్ తో ముందుకొచ్చింది బీఎస్ఎన్ఎల్ రూ.429 రూపాయలకే వాయిస్, డేటాతో సెంట్రిక్ ప్లాన్ అనే ఆఫర్ ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 

 ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులు రూ. 429తో 90 రోజులపాటు ప్రతిరోజు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని బీఎస్ఎస్ఎల్ స్పష్టం చేసింది. ఈ ప్లాన్‌తో లోకల్, ఎస్టీడీ కాల్స్ ఇతర నెట్ వర్స్‌కు ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించినట్లు సంస్థ వెల్లడించింది. కేరళ తప్ప ఇతర రాష్ట్రాలకు ప్యాన్ - ఇండియా బెసిస్‌తో ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్ తో మూడు నెలలవారీగా వాయిస్, లోకల్, ఎస్టీడీ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఇప్పటికే పలు ఆఫర్లు ప్రకటించిన  బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్ తో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి...

 

loader