బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ 

‘జియో’ పోటీని తట్టుకునేందుకు పోటీ టెలికాం సంస్థలు కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా కొత్త ఆఫర్ తో వినియోగదారుడిని ఆకట్టుకునేందుకు ముందుకొచ్చింది.

అయితే ల్యాండ్ లైన్ ఖాతాదారులే లక్ష్యంగా ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఆదివారం పూర్తి రోజూ అలాగే, మిగిలిన రోజులు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ల్యాండ్ లైన్ నుంచి ఏ నెట్‌వర్క్ కు అయినా అపరిమిత కాల్స్‌ చేసుకునేందుకు కొత్త టారీఫ్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 49 చెల్లించి ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

కొత్త ఖాతాదార్లకు మాత్రమే ఈ ఆఫర్‌ అవకాశం కల్పిస్తుంది. దీని కాలపరిమితి 6 నెలల వరకు ఉంటుంది.

గతంలో రూ.99 కి ఈ ఆఫర్ ఉండేది. అయితే ఇప్పుడు అది రూ. 49 వస్తోంది.