Asianet News TeluguAsianet News Telugu

డామిట్, పెళ్లి అడ్డం తిరిగింది...

డిజైనర్ శారీస్ , లెటేస్ట్ నగలు లేవని ఈ పెళ్లి కూతరు పీటల్ని తన్నేసి వెళ్లిపోయింది...

bride refuses marriage  demanding designer sarees

పెళ్లికొడుకు అదిరిపోయాడు...

 

పెళ్లి కొడుకు తండ్రి,  సపరివారం కంగుతిన్నారు.

 

పెళ్లి కూతరు సోనాలిక గడ్డం పట్టుకుని బతిమాలారు.

 

ఈ పెళ్లాగిపోకుండా చూడమన్నారు. పెళ్లాగి పోతే, మా అబ్బాయిని మళ్లీ పెళ్లెవరు చేసుకుంటారని ప్రాధేయపడ్డారు. అయినా సోనాలిక (అసలు పేరు వేరు)మనసు కరగ లేదు. కాదు కూడదనింది. ఈ పెళ్లి జరగడానికి వీళ్లేదంది.  పెళ్లి కోసం, ఆపై విందు కోసం వచ్చిన వారి చుట్టాలు, వీరి చుట్టాలు విస్తుపోయి చూస్తుండి పోయారు. వాళ్లు కూడా పెళ్లి కూతురిని బతిమాలారు. అడ్జస్టు చేసుకోమన్నారు. ఇంత అధ్వాన్నమా  అని మగ పెళ్లివారినీ దండించారు. అయినా  పట్టువదలని సోనాలిక విసవిస పెళ్లిపీటలనుంచి వెళ్లి పోయింది.శుక్రవారం జరగాల్సిన పెళ్లి తంతు అగిపోయింది.

 

పెళ్లికూతురు సోనాలిక అగ్రహానికి కారణం ఏమిటి? పెళ్లికొడుకు తీసుకువచ్చిన పెళ్లి వస్త్రాలు, నగలు .

 

‘ ఇలాంటి నాసి రకం బట్టలు కట్టుకుని, ఈ  పాతకాలపు నగలేసుకుని పెళ్లి చేసుకోలేను,’ అని ఉత్తర్ ప్రదేశ్ హాపూర్ జిల్లాకు చెందిన సోనాలిక గొల్లుమంది.

 

తననుకున్నదేమిటి? జరిగిందేమిటి అంటూ  పెళ్లి  కొడుకు తెచ్చిన బట్టలను విసిరికొట్టి వలవలా ఏడ్చింది. సరిగ్గా మూడు ముళ్లు పడాల్సిన సమయంలో ఈ పెళ్లి కూతురు అప్ సెట్ కావడంతో అక్కడున్నవాళ్లంతా కూడా అప్ సెట్ కావల్సివచ్చింది.

 

పక్కను ఉన్న మీరట్ జిల్లా గవండి గ్రామానికి చెందిన పెళ్లి కొడుకు మరుసటి రోజు దాకా తేరుకోలేకపోయారు.  కొంత మంది శనివారం నాడు ఈ విషయాన్ని లోకల్ పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.  అబ్బే , ఇలాంటి విషయాలు మీరు మీరు తేల్చుకోండని పోలీసు కర్ర తిప్పుకుంటూ చెప్పారు.

 

ఊరి పంచాయతి సమావేశమయింది. ఏంకావాలని ముద్దుల సోనాలికను అడిగారు. డిజైనర్ శారీస్, లేటెస్ట్ ట్రెండ్  నగలు లేని పెళ్లి నాకొద్దంది సోనాలిక. మాకుటంబాన్ని అవమానపర్చారన్నారు ఆడపెళ్లివారు. మగపెళ్లి వారికి కోపమొచ్చింది. మాకీ పిల్ల వద్దు, పెళ్లి వద్దు.. అంటూ, పదరా అబ్బాయ్, వెళ్లిపోదామని లేచారు.

పెళ్లి పెటాకులయింది. అయితే,పెద్ద మనుషులు పెళ్లికొడుకు బృందం నష్టపరిహారం చెల్లించాకే వూరొదలాలని షరతు విధించారు. చివరకు మగపెళ్లివారు 1.5 లక్ష పెళ్లి ఖర్చుల కిచ్చి సోనాలికకు గుడ్ బై చెప్పి శనివారం నాటికి గాని వూరు పొలిమెర దాటలేకపోయారట.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios