పెళ్లి కి అంగీకరించి తీరా ముహూర్తంరాగానే జంప్ అయిన వరుడికి ఓ పెళ్లి కూతరు సరైన గుణపాఠం చెప్పింది. 

పెళ్లి పీఠలెక్కకముందే వరుడు చెప్పపెట్టకుండా పారిపోతే పెళ్లికూతరు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలిసిందే. 

ఆ బాధ తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు మనకు తెలిసిందే. అయితే చైనాలో అలా చేసిన పెళ్లికొడిక్కు ఓ యువతి మంచి గుణపాఠం చెప్పింది.

పెళ్లి కి అంగీకరించి తీరా ముహూర్తం ముంచుకొచ్చినా ఇంకా వరుడు రాకపోయే సరికి ఆ వధువుకు పరిస్థితి అర్థమైంది.

ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి దుస్తులతోనే రోడ్డెక్కింది. వరుడి కోసం ఊరంతా గాలించింది. చివరకు అతడిని పట్టుకొని చితగొట్టింది.

తన చేతికి ఉంగరం పెట్టిన వరుడి చేతులను ఇనుప సంకేళ్లతో బంధించి రోడ్డు మీద ఈడ్చుకుంటూ పెళ్లిమండపానికి తీసుకెళ్లింది.

అలా రోడ్డు మీద ఓ యువతి పెళ్లిదుస్తుల్లో వరుడిని సంకెళ్లేసి ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటే అక్కడున్నవారంతా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు.

అయితే వరుడు ఎందుకు పెళ్లి ముహుర్తానికి ముఖం చాటేశాడనేది తెలియ లేదు. కానీ, వధువు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లుంది.

కాబోయే మొగుడని కూడా చూడకుండా రద్దీ రోడ్డుపైనే ఈడ్చుకుంటూ పెళ్లిమండపానికి తీసుకెళ్లింది.

ఈ ఘటనను ఓ నెటిజన్ వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. పెళ్లికూతరు చేసిన సహసాన్ని నెటిజన్లు అందరూ తెగ పొగిడేస్తున్నారు.