ప్రపంచంలో ఎవ్వరు ఇలా చెయ్యరు (వీడియో)

boy sleeps on fifth floor window ledge after scolding from dad in china
Highlights

అసలేంజరిగిందని పిల్లాడిని ఆరా తీస్తే.

తాజాగా ఓ 12 ఏండ్ల బాలుడు తండ్రి తిట్టాడని ఐదో ఫ్లోర్‌లో ఉన్న ఫ్లాట్ విండో నుంచి బయటికి వచ్చి దాని లెడ్జ్ మీదికి వెళ్లి పడుకున్నాడు. ఇక.. ఐదో ఫ్లోర్ విండో బయట ఉన్న లెడ్జ్ మీద ప‌డుకున్న‌ బాలుడిని గమనించిన స్థానికులు వెంటనే రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది క్రేన్ సాయంతో ఆ పిల్లాడిని కాపాడారు. ఈ ఘటన చైనా గైజావ్ ప్రావిన్స్‌లోని జియాంగ్‌కౌ సిటీలో చోటు చేసుకున్నది. 

అసలేంజరిగిందని పిల్లాడిని ఆరా తీస్తే.. లేట్‌గా లేస్తున్నానని మా నాన్న నన్ను రోజూ తిడుతున్నాడు. ఇవాళ కూడా తిట్టాడు. అందుకే.. నా బెడ్‌రూం విండో నుంచి బయటికి వచ్చి లెడ్జ్ మీద పడుకున్నా.  అని సెలవిచ్చాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.

loader