జనసేన పార్టీలో ఇప్పటికయితే వన్ మాన్ ఆర్మీయే. జనం ఇంకా చేరలేదు. సేన తయారువుతుందునుకోవాలి.  సేనాపతేమో సినిమాలలో  ఉంటు అపుడపుడు పైకి తెేలి వచ్చి వెళ్లిపోతున్నారు. అయితే, పార్టీకి పెద్ద ఎత్తున  అభిమానులున్నారు. చాలా మంది జనసేన పార్టీ లాంచింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అధినేత పవన్ కల్యాణ్ రెడీ అంటే రాజకీయ రంగంలోకి దూకేందుకు ఎదురు చూస్తున్నారు. అక్కడడక్కడ సేవా కార్యక్రమాలుకూడా ర్వహిస్తున్నారు. అయితే, పెరిగిపోతున్న అభిమానులును సొమ్ముచేసుకునేందుకు వాళ్లూ  తయారయినట్లు , వాళ్లు రోడ్లెక్కి జనసేన  ప్రతినిధులమనిచెప్పి వసూళ్లు కూడా  మొదలుపెట్టినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా అంగీకరించి, అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ట్విట్టర్ ద్వారా సూచన లిచ్చారు. అయితే, ఇలాంటి సమస్యలొచ్చినపుడు  జోక్యం చేసునేందుకు పవన్ కల్యాణ్ ఒక వ్యక్తికి బాధ్యతలప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తారు. చిన్న చితకా సమస్యలొస్తే ఆయన చూసుకుంటారుట.  ఆయనెవరో తెలుసా? విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు. బోండా ఉమామహేశ్వరరావు కాపు నాయకుడు.  పవన్ కల్యాణ్ కు  బాగాసన్నిహితుడు. తెలుగుదేశం లో బాగా పేరున్న వాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా సన్నిహితుడని చెబుతారు. అయినాసరే,  ఆయనకు క్యాబినెట్ మంత్రి పదవి దక్కలేదు. దీనితో ఆయన బాగా అసంతృప్తి చెందారు. అలిగి కొద్ది రోజులు మౌనం పాటించారు.  ఆయనికి జనసేన లో వెళ్తారని అనుకున్నారు. తర్వాత ఈ వ్యవహారం సద్దు మణిగింది. ఇపుడాయన ఇంటింటికి టిడిపి కార్యక్రమంలో బిజిగా తిరుగుతున్నారు.

మరొక వైపు, జనసేనవ్యవహారాలను కూడా ఆయన చక్కబెడుతుండటం తెలుగుదేశంలోచర్చనీయాంశమయింది.  జనసేనలో  ముందు ముందు పెద్ద పాత్ర పోషించాలనుకుంటున్నవారు, పార్టీలో చేరాలనుకుంటున్నవారు, ఇప్పటికే  జనసేనలో చేరిన వారు ఆయనతో రెగ్యులర్ గా సంప్రదిస్తున్నారట. బోండా జోడు గుర్రాల స్వారీ చేస్తున్నాడని, 2019 ఎన్నికల దృష్టి లో పెట్టుకునే ఇలా చేస్తున్నాడని టిడిపి గుసగుసలుపోతున్నారు. తెలుగుదేశం లో కొనసాగుతూ జనసేనకు పెద్ద దిక్కుగా ఉండటమేమిటనే ప్రశ్నకూడా వినపడుతూ ఉంది.