జనసేనలో చేరనున్న‘బిగ్ బాస్’ విన్నర్ శివబాలాజీ

జనసేనలో చేరనున్న‘బిగ్ బాస్’ విన్నర్  శివబాలాజీ

*బిగ్ బాస్* విన్నర్ శివబాలాజీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.  ఆయన తొందర్లో  పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీలో చేరునున్నారనే వార్త పవన్ అభిమానుల్లో గుప్పుమంది. శివబాలాజీ చేరిక జనసేన కు వూపు నిస్తుంది. మళ్లీ పాతముఖాలు, రాజకీయాల్లో అపఖ్యాతి పాలయిన ముఖాలకు జనసేన అడ్డా కాకుడదని పవన్ అభిమానులు భావిస్తున్నారు. ఇంతవరకు పవన్ జాగ్రత్తగా అడుగేస్తూ జనసేన గేట్లు బార్లా తెరవకుండా మంచిపని చేశారనుకోవాలి. ఇలాంటపుడు శివబాలాజీ జనసేనలోకి వస్తున్నారన్నవార్త వినిపిస్తూ ఉంది. చాలా మంది ఇదొక మంచిపరిణామం అంటున్నారు. శివబాలాజీ చేరికతో జనసేన క్రెడిబిలిటి పెరుగుతుందని   పవన్ అభిమాని ఒకరు  చెప్పారు. శివబాలాజాకి పవన్ కు మంచిస్నేహం ఉంది. కాటమరాయుడులో ఆయన పవన్ సోదరుడిగా నటించారు. శివబాలాజీ చిత్రాలకు పవన్ తో పాటుఅభిమానుల మద్దతు కూడా ఉంది. అందువల్ల శివ చేరిక గాలివార్త కాకపోవచ్చు. ఈ వార్తను ఎవరూ ధృవీకరించకడంలేదు. అయితే, డిసెంబర్ మొదటి వాారంలో ఆయన పవన్ సమక్షంలో పార్టీలో చేరతారని అనుకుంటున్నారు.

 

 

 

 

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page