రాజ్ భవన్ విందుకు హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు

ఎట్టకేలకు గవర్నర్ కోరిక నెరవేరింది. తెలుగు రాష్ట్రాల సీఎంలను ఒకే దగ్గరికి తీసుకరావాలని ప్రయత్నించిన గవర్నర్ నరసింహన్ చివరకు ఆ పని చేశారు. దీనికి రాజ్ భవన్ వేదికైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ రాజ్‌భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

ఈ విందులో ఇద్దరు చంద్రులు చాలా సమయం మాట్లాడుకోవడం గమనార్హం.

విందుకు రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు తదితరులు హాజరయ్యారు.