Asianet News TeluguAsianet News Telugu

పోయెస్ గార్డెన్ నుంచి శశికళను తరిమేస్తున్నారా...

పోయెస్ గార్డెన్ లో  ఉంటూ  జయ వారసురాలు హోదా  చూపిస్తున్న శశికళ. ఆమెను తరిమేసి జయ మ్యూజియం ఏర్పాటుకు యత్నం, వెంకయ్య మద్దతు.

attempt to evict Sasikala from poes garden
  • Facebook
  • Twitter
  • Whatsapp

తమిళనాడు రాజకీయాలను ఎవరు నడిపిస్తున్నారని చెన్నైలోనే కాదు, భారత దేశంలో ఎక్కడైనా ఎవరినైనా అడగండి. బిజెపి అని సమాధానం టక్కున వచ్చేస్తుంది.  తమిళనాడు లో ఎదురయినరాజకీయా పరిస్థితులను ఎలాగయినా వాడుకుని  రాష్ట్రంలో ఏదో ఒక మూలన జండా ఎగరేయాలని బిజెపి చూస్తూ ఉంది.

 

దీనికోసం శత విధాల ప్రయత్నిస్తూ ఉంది కాషాయపార్టీ. మోదీ కాలంలో తమిళనాడులో బిజెపి కాలూనగలిగిందని చెప్పుకోవడం ఈపార్టీకిఇపుడు చాలా అవసరం.  అయితే, జయలలిత నెచ్చెలి శశికళ కొరకరాని కొయ్యగా తయారయింది.  తమిళ రాజకీయాలలో బిజెపి తల దూర్చి తమిళ గడ్డ మీద కాలుమోపాలని చూస్తున్నదని శశికళ, ఆమె భర్త నటరాజన్ చాలా సార్లు చెప్పారు. తమిళనాటు బిజెపి వ్యతిరేక బిజెపి నాటారు. అయితే, ఇది మొలకెత్తి మొక్కయి మానుగా ముదిరేలోపు శిశకళను తరిమేసి, పన్నీర్ సెల్వాన్ని  ముఖ్యమంత్రి నిచేయాలనిచూస్తున్నారు బిజెపి నాయకులు.  విశ్వాసానికి మారుపేరయిన పన్నీర్ సెల్వం దీనికి ప్రతిగా  2019 ఎన్నికలలో బిజెపి తో పొత్తుపెట్టుకుని కొన్ని సీట్లు గెలిచేందుకు సహాయం చేస్తాడని బిజెపి ఆశ.  దీని కోసం శశికళను బలహీన పర్చాలి.

 

ఎలా?

 

ఎమ్మెల్యేల నందరిని వెనకేసుకుని గోల్డెన్ బెే రిసార్టలో దాచిపెట్టినా,  పోయెస్ గార్డెన్ లోని వేదనిలయమే శశికళ హెడ్ క్వార్టర్ . జయ చనిపోయాక వేదనిలయం  శశికళ చేతిలోకి వెళ్లింది.ఇది ఆమెకు చాలా మానసిక స్థయిర్యాన్ని అందించింది. అక్కడినుంచి శశికళను తరిమేస్తే,చెన్నయిలో అమెకు ఈ మానసిక స్థయిర్యం అందిస్తున్న అడ్రసు పోయిన నిరాశ్రయరాలవుతుంది. వేదనిలయం నుంచిపనిచేయడంతో  శశికళకు స్థాన బలం కలసొస్తూ ఉంది. దీనితో ఆమెకు శశికళ కూడా హోదాదక్కింది. వేదనిలయం చూసేందుకు తరలివస్తున్న జయ అభిమానులను ఆమె జయలాగే బాల్కనీ నుంచి  అభివాదం చేస్తున్నారు.  ఇదంతా శశికళ జయకు నిజమయిన వారసురాలనే భ్రమ కల్గిస్తుంది. దీనిని పోగొట్టి, శశికళను మానసికంగా దెబ్బతీసేందుకు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఏమిటంటే, ఆమెని పోయెస్ గార్డెన్ నుంచి తరిమేయడం.

 

ఇందులో భాగంగా మూడు రోజుల కిందట వేదనిలయాన్ని జయలలిత స్మారక మ్యూజియంగామారుస్తామని తాత్కాలికముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించడం.   బిజెపి దక్షిణ దండయాత్ర వ్యూహం అమలు చేస్తున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు  వెంటనేఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపారు. పన్నీర్ సెల్వం ప్రతిపాదన మీద స్పందిస్తూ,  ‘ జయలలిత మహానాయకురాలు. ఆమె నివాళులర్పించేందుకు రోజూ ఎందరో ప్రజలు అమె నివాసానికి వస్తున్నారు అందుల్ల ఆమె నివాసాన్ని మ్యూజియం చేయాలనుకోవడాన్ని ఆహ్వానిస్తున్నా,’ అన్నారు. . అయితే,  ఈ మాట అంటూనే వెంకయ్య నాయుడుమరొక విషయం నోరు  జారారు. “ తమిళనాడు జరుగుతున్న రాజకీయ పరిణామాలలో బిజెపికి ఎలాంటి పాత్ర లేదు. అంతా అనుకుంటున్నట్లు ఇందులో బిజెపి పాత్ర ఏమీ లేదు,” అని అన్నారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో.

 

 జయలలిత తన  81, పోయస్ గార్డెన్ నివాసానికి తల్లి పేరు మీద వేద వల్లి పేరు మీద వేదనిలయం అని పేరుపెట్టారు. వేదవతి  సంధ్యగా తెలుగు, తమిళ సినీప్రేక్షకులకు సుపరిచితురాలు.  24,000 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఉన్న ఈ ఇంటిని జయలలిత 1967లో రు.1.32 లక్షలకు కొన్నారు. ఇపుడు దీని వెల కనీసం వందకోట్లుంటుందని అంచనా. ఈ ఇంట్లో సంధ్య నివసించింది కొద్ది కాలమే. ఎక్కవ కాలం ఉండింది జయలలిత, శశికళయే...

 

 

Follow Us:
Download App:
  • android
  • ios