నేటి విశేషాలు గణేష్ నిమజ్జనానికి వేయి మంది ఆంధ్రా పోలీసులు మైనర్ బాలిక కిడ్నాప్ చేసింది ఎమ్మెల్యే అనుచరుడా? విజయవాడలో అర్జున్ రెడ్డి ‘శవయాత్ర’ పోలవరం ప్రాజక్టు అంతే సంగతులా... సిలిండర్ పేలి ఇద్దరు సజీవ దహనం, ఒకరు ఆసుపత్రిలో మృతి వార్డు మెంబర్ భర్త అఘాయిత్యం చూడండి ఇంకా ఎన్నో ...

ఈ డ్రైవర్ సెల్ ఫోన్లో మాట్లాడుతూంటే ఇలా జరిగింది

⁠⁠⁠⁠⁠భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్ టీ సి బస్సొకటి సిమెంట్ లారీ ట్యాంకార్ డీ కొట్టింది. పలితంగా 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయలయ్యాయి.

బస్సు డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ స్టయిల్ గా బస్సు నడపటంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని సుజాతనగర్ పోలీసులు తెలిపారు.

ఈ ఆడోళ్లిలా దొరికిపోయారు,పాపం

పోలీసులకు ఉప్పందింది. శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలోని ఒకఇంట్లో జోరుగా పేకాట నడుస్తూ ఉందని ఎవరో సమాచారమిచ్చారు.గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు ఆ ఇంటిమీద రెయిడ్ చేశారు. అవాక్కయ్యారు. అక్కడ నిజంగా పేకాట జోరుగా నడస్తున్నందుకు కాదు. పేకాటలో మహిళలు కూడా ఉండటంతో పోలీసులకు దిమ్మ తిరిగింది. చాలా సార్లు పేకాట్ డెన్ ల మీద రెయిడ్ చేసినా పేకాడుతున్న మహిళలు ఎపుడూ కనిపించలేదు. కాని పార్వతీపురం డెన్ లో మొత్తం 14 మందిని అరెస్ట్‌ చేస్తే వారిలో ఆరుగురు మహిళలున్నారు. పేకాట రాయుళ్ల దగ్గరి నుంచి 18 వేల 4 వందల రుపాయాలతో సెల్‌ఫోన్లను కూడా పోలీసులు లాక్కున్నారు.

మంగళవారం ఉదయం 6 గంటలనుంచి శోభాయాత్ర

హైదరాబాద్, ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు గ‌ణేశ్ శోభా యాత్ర ప్రారంభమవుతుంది. ఈఏర్పాట్లు సాగుతున్నందున ఖైరతాబాద్ గణేశ్ దర్శనం సోమవారం అర్ధ‌రాత్రి బంద్ అవుతుంది. ఆ తర్వాత భక్తులను అనుమతించరని ఖైర‌తాబాద్ గ‌ణేశ్ ఉత్స‌వ క‌మిటీ తెలిపింది. హుసేన్ సాగర్ లో నాలుగో నంబ‌ర్ క్రేన్ దగ్గర ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌ప‌తి నిమ‌జ్జ‌నం జ‌రుగుతుంది. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌లోపు నిమ‌జ్జ‌నం పూర్త‌య్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైర‌తాబాద్ నుంచి సెన్షేష‌న్ థియేట‌ర్, టెలిఫోన్ భ‌వ‌న్, తెలుగు త‌ల్లి ఫ్లై ఓవ‌ర్, స‌చివాల‌యం, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా గ‌ణ‌ప‌తి శోభాయాత్ర జ‌ర‌గుతుందని ఉత్స‌వ క‌మిటి ప్రతినిధులు తెలిపారు.57 అడుగులున్న ఖైరతాబాద్ మహాగణపతి తయారీలో 40 వేల కిలోల ప్లాస్టర్ఆప్ పారిస్ వాడారు.

హైదరాబాద్ గణేజ్ నిమజ్జనానికి వేయి మంది ఆంధ్రా పోలీసులు

హైదరాబాద్‌లో మంగళవానం జరుగునున్న వినాయక నిమజ్జనానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది తరహాలోనే ప్రఖ్యాత ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం ముందుగా నిర్వహిస్తారు.. దీనికి గణేష్‌ ఉత్సవ కమిటీ కూడా అంగీకరించింది. ఈ విషయాలను తెలంగాణా డిజిపి అనురాగ్ శర్మ వెల్లడించారు. గణేష్‌ శోభాయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అయన చెప్పారు.తెలంగాణ లో మొత్తం 94,856 వినాయక విగ్రహాలు పెట్టారు.హైద్రాబాద్ లో 25 వేల 850 విగ్రహాలు ఉన్నాయి.ఇప్పటికి 40 శాతం విగ్రహాలు నిమజ్జనాలు అయ్యాయి.నగరంలో నిమజ్జనానికి సుమారు 26వేల మంది పోలీసులతో బందోబస్తు చేస్తున్నారు. బందోబస్తు విధుల్లో 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది సీఐలు, వెయ్యి మందికి పైగా ఎస్‌ఐలు, 80 ప్లాటూన్ల పారా మిలటరీ బలగాలు ఉంటాయి. ఆంధ్ర ప్రదేశ్ నుంచి నుంచి కూడా వెయ్యి మంది పోలీసులు రానున్నట్లు డిజిపి చెప్పారు. గణపతి శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు ఏరియల్‌ సర్వే ద్వారా గట్టినిఘా ఉంటుందని డిజిపి తెలిపారు.

కృష్ణాజిల్లాలో దారుణం


కృష్ణా జిల్లా పెడన సమీపంలోని గూడూరులో దారుణం జరిగింది.పెళ్లయిన ముడునెలలకే భార్య యార్లగడ్డ నాగమమత(20)ను చంపి గోనె సంచిలో కట్టి భర్త నాగరాజు ఇంటి వెనుక పాతి పెట్టాడు. అయితే ఇది బయటకు పొక్కింది. వ్యవహారం పోలీసుల దాకా వెళ్లింది. పోలీసుల ఈ రోజుగోనె సంచిని వెలికితీసి ఆవాక్కయ్యారు. 
భర్త నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు.

మైనర్ బాలికను కిడ్నాప్ చేసింది ఎమ్మెల్యే శ్రావణ్ అనుచరుడట

గుంటూరు జిల్లాలో జరిగిన మైనర్ బాలిక అదృశ్యం కేసులో పోలీసుల తీరును నిరసిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు. తాడికొండ మండలం పొన్నేకల్లుకు చెందిన దీప్తి 15 రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు ఆచూకీ కనిపెట్టకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు.తమ కుమార్తెను గోపీకృష్ణ అనే యువకుడు కిడ్నాప్ చేశాడని వారు ఆరోపిస్తున్నారు. దీప్తి తల్లిదండ్రులు అతను ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అనుచరుడు కాబట్టే కేసును పట్టించుకోవడం లేదన్నది వారి ఆరోపణ. దీనిపై సీ జోక్యం చేసుకోవాలని కోరుతున్న దీప్తి పేరెంట్స్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్ కు వెళ్లారు. వారొచ్చింది ఎమ్మెల్య మీద ఫిర్యాదుచేసేందుకు కని కనుక్కున్న పోలీసులు అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. దీనితో వారు ఆందోళనకు దిగారు. అయితే, కేసు పై నిర్లక్ష్యం గా వ్యవహరించారని తాడికొండ ఎస్ ఐ వీరానాయక్ ను జిల్లా పోలీస్ సూరింటెండెంట్ వీ ఆర్ కు పంపినట్లు సమాచారం

విజయవాడలో అర్జున్ రెడ్డి ‘శవయాత్ర’

తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావుకు శుభవార్త. అర్జున్ రెడ్డి అశ్లీలం మీద పోరాడేందుకు ఆయనకు తోడు దొరికింది. ఇంతవరకు ఆయనే హైదరాబాద్ లో అర్జున్ రెడ్డి, హీరోయిన్ చుంబనాల పోస్టర్లను చించేశాడు. నిరసనగా రోడ్డెక్కాడు. రామ్ గోపాల్ వర్మతో కూడా వాదులాడాడు. ఇపుడు ఆయనకు తోడున్నారు. కాకపోతే, పక్క రాష్ట్రం విజయవాడలో. అక్కడ అర్జున్ రెడ్డి చిత్రంలో అశ్లీలత కట్టు తెంచుకుందని ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య వారు కూడా రోడ్డెక్కారు. మరీ వినూత్నంగా నిరసన తెలిపారు. అర్జున్ రెడ్డి అశ్లీలతను నియంత్రించలేక చనిపోయిందని సెన్సార్ బోర్డు శవ యాత్ర జరిపారు.దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమేఖ్య ఆద్వర్యంలో సీపీఐ ఆఫీస్ నుండి లెనిన్ సెంటర్ వరకు వారు శవ యాత్ర నిర్వహించారు.

పోలవరం ప్రాజక్టు అంతే సంగతులా...

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మక భావిసక్తున్న పోలవరం ప్రాజక్ట్ వివాదంలోపడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జాప్యం జరగుతూ ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పోలవరం కాంట్రాక్ట్‌ సంస్థ ట్రాన్స్ టాయ్‌కు కాంట్రాక్ట్ లోని 60-సి కింద నోటీసులు జారీ చేసింది. పనుల జాప్యం కారణంగా సంస్థను ఎందుకు తొలగించకూడదో చెప్పాలని ఆ నోటీసులో పేర్కొంది. 2018 నాటికి నీరు ఇవ్వాలంటే పనుల వేగం పెరగాలని ప్రభుత్వం పేర్కొంది.

అయితే, కాంట్రాక్టర్ గా రష్యాకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ పేరున్నానిజానికి అసలు కాంట్రాక్టర్ ఎవరో కాదు, టిడిపి ఎంపి రాయసాటి సాంబశివరావే. ఆయనకు కాంట్రాక్ట్ దక్కించేందుకు చంద్రబాబు చాల కష్టపడ్డారనిచెబుతారు. అయితే, ఆయనని ఇపుడు ముఖ్యమంత్రి ఎంచేస్తారో చూడాలి. ఇక్కడ మరొక తమాషా ఉంది. 2018 నాటికి ప్రాజక్టు నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు చెబితే, అసలు కానేకాదని, టిడిపి అనంతపురం ఎంపి దివాకర్ రెడ్డి దాదాపు సభలో చెబుతుంటారు. ఎలాగూ పూర్తికాదని, జాప్యం కాంట్రాక్టర్ మీద తోసేసేందుకు ప్రభుత్వం ఈ నోటీసుల నాటకమాడతూ ఉందని కూడా అమరావతిలో గుసగుసలు వినబడుతున్నాయి. ముఖ్యమంత్రి ప్రతి సోమవారం రివ్యూ చేస్తున్నా, కాంట్రాక్టర్ మందకొడిగా పనులు నడిపాడంటే, ఆ దైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఇపుడీ ప్రాజక్టు కాంట్రాక్ట్ ను రద్దు చేసి, కొత్త కాంట్రాక్టర్ నియామకం సాధ్యమా... వ్యవహారం కోర్టు కెళ్లదా... అపుడు ప్రాజక్టేమవుతుంది. అందుకే అంతే సంగతులు.. లాాగా ఉంది వ్యవహారం.

పినాకిని ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌: పినాకినీ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న పినాకినీ ఎక్స్ ప్రెస్ గుటూరు జిల్లా తెనాలి దాటిన తరువాత మల్లిపాడు వద్ద శబ్దం మారడంతో అప్రమత్తమైన ట్రైన్ డ్రైవర్ రైలు నిలిపివేశాడు. అనంతరం పరిశీలించగా, మల్లిపాడు వద్ద పట్టా విరిగిపోయి ఉండడాన్ని గుర్తించారు. డ్రైవర్ ముందుగా అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. పెను ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.

యాదాద్రి జిల్లాలో సిలిండర్ పేలి ముగ్గురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో సోమవారం ఉదయం ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంకటరెడ్డి, ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తలు అక్కడిక్కడే కాలిపోయి చనిపోయారు. తీవ్రంగా గాయపడిన బాలమ్మను భువనగిరి స్థానిక ఆస్పత్రికి తరలించారు ఆమె ఆసుప్రతిలో మరణించారు.. పేలుడు ప్రభావంత్ చుట్టుపక్కల ఇళ్లు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్యాస్ సిలిండర్ పేలిందా లేక ఏమైనా పేలుడు పదార్ధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేస్తోంది.

ఈ వార్డు మెంబర్ భర్త అఘాయిత్యం చూడండి

ఒక అమాయక బాలికపై పంచాయతీ వార్డు మెంబర్ భర్త ఆత్యాచారం జరిపాడు. అంతేకాదు, ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని కూడాఅతగాడు బెదిరించాడు. అయితే, బాలిక మొదటబయపడినా, తర్వాత ధైర్యంగా తనకు జరిగిన అన్యాయన్ని తల్లికి చెప్పింది. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబ్దుల్లాపూర్ మండలం కేంద్రంలో ఓ మహిళ హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. మహిళ భర్త సంవత్సరం క్రితం చనిపోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటుంది. వార్డు మెంబర్ సుజాత భర్త నాగరాజు (40) బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. సుజాత సహాయంతో ఇతగాడు బాలికపై రెండు సార్లు అత్యాచారం చేసినట్టు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వార్డు మెంబర్ను, ఆమె భర్తని కూడా అదుపులోకి తీసుకున్నారు.

కర్నూల్ జిల్లాలో ఇద్దరి దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విక్టోరియాపేటకు చెందిన ఇద్దరిని ఎవరో దారుణంగా హత్య చేశారు. నాగేంద్ర, నరేష్‌ అనే అన్నదమ్ములు హత్యకు గరయ్యారు. గత రాత్రి నాగేంద్రను ఎవరో కిడ్నాప్‌ చేసుకుబోయారు. అడ్డుకోబోయిన నరేష్‌పై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ నరేష్‌ మృతి చెందాడు. తుంగభద్ర లో లెవెల్ కాలువ గట్టు మీద నాగేంద్ర శవం కనిపించింది. దుండగులు అతనిని నరికి చంపడమే మృతదేహాన్ని అక్కడే తగులబెట్టే ప్రయత్నం చేశారు.పోలీసులు ఇద్దరి మృతదేహలను పోస్టుమార్టం కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యలకు కారణమని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గుడిలోకి చొరబడిన ఎలుగుబంటు

మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట మండలం అయ్యవారిపల్లిలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి 8గంటల సమయంలో ఎలుగు బంటి గ్రామంలోకిచొరబడింది. దీనితో స్థానికులను భయాందోళనకు గురయ్యారు. అటూ ఇటూ పరుగులు తీశారు. తర్వాత పెద్ద పెద్ద అరుపులు చేస్తూ, తలపులు తెరచి ఉన్న హనుమాన్ ఆలయంలోకి చొరబడింది. అయితే, ఆలయం నుంచి అరుపులు వినిపించడంతో స్థానికులు ఆలయం తలుపులు మూసేసి తాళం వేశారు. తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఎలుగుబంటిని బంధించారు.