ఏపీ నందీ అవార్డులు- ఉత్తమ చిత్రం లెజెండ్
- నంది అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ఉత్తమ నటుడిగా ఎంపికైన బాలకృష్ణ
- ఉత్తమ చిత్రంగా ఎంపికైన లెజెండ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014,2015,2016 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. వాటితోపాటు నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ అవార్డు, రఘుపతి వెంకయ్య సినిమా పురస్కారాలను కూడా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందజేసిన జ్యూరీ కమిటీ సభ్యులు మంగళవారం వివరాలను వెల్లడించారు. కమిటీ ప్రతినిధులు బాలకృష్ణ, మురళీ మోహన్, గిరిబాబు తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
నంది అవార్డులు
2014 ఉత్తమ చిత్రం లెజెండ్
2014 ఉత్తమ నటుడు బాలకృష్ణ ( లెజెండ్)
2014 ఉత్తమ ప్రజాదరణ చిత్రం లౌక్యం
2014 ఉత్తమ ప్రతినాయకుడు జగపతిబాబు(లెజెండ్)
2014 ఉత్తమ సహాయ నటుడు నాగచైతన్య(మనం)
2014 ద్వితీయ ఉత్తమ చిత్రం- మనం
2015 ఉత్తమ చిత్రం బాహుబలి(బిగినింగ్)
2015 ఉత్తమ నటుడు మహేష్‌బాబు( శ్రీమంతుడు)
2016 ఉత్తమ చిత్రం పెళ్లిచూపులు
2016 ఉత్తమ నటుడు జూనియర్ ఎన్టీఆర్
2015 ఎన్టీఆర్ జాతీయ అవార్డు-కె.రాఘవేంద్రరావు
2016 ఎన్టీఆర్ జాతీయ అవార్డు- రజనీకాంత్
2015 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- త్రివిక్రమ్ శ్రీనివాస్
2016 బీఎన్‌రెడ్డి జాతీయ అవార్డు- బోయపాటి శ్రీనివాస్