ఇది మరో సంగీత కథ( వీడియో)

First Published 24, Nov 2017, 2:15 PM IST
Another Sangeetha manavata stages mauna deeksha at in laws place for justice
Highlights
  • అత్తారింటి ఎదుట మౌన దీక్ష చేస్తున్న మహిళ
  • అమెరికా నుంచి భర్తను ఇండియాకు రప్పించాలని డిమాండ్

 

తెలంగాణ రాష్ట్రంలో మరో సంగీత కథ వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. టీఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత ఐదురోజులుగా అత్తగారింటి ముందు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనే కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. మానవతా అనే మహిళ.. తన నాలుగేళ్ల కుమార్తె శాన్వితో కలిసి అత్తారింటి ముందు దీక్ష చేస్తోంది.

మానవతా భర్త ఫణీంద్రకుమార్.. భార్య, బిడ్డలను వదిలిపెట్టి అమెరికా వెళ్లిపోయాడు. దీంతో.. అమెరికాలోని తన భర్తను ఇక్కడికి రప్పించాలని డిమాండ్ చేస్తూ ఆమె గత 40రోజులుగా మౌనదీక్ష చేస్తోంది. 40రోజులుగా చిన్నపాపతో అత్తారింటి ముందు టెంట్ వేసుకొని దీక్ష చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. దీక్ష విరమించాలంటూ అత్తారింటి వాళ్లు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

loader