చంద్రబాబు వినూత్న ప్రయోగం

andhra to release health bulletin on free medical  services
Highlights

ఉచిత వైద్య సేవలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి, ఎక్కడ ఏ సర్వీసులన్నాయి, ఎక్కడ పరికాలు పనిచేస్తున్నాయి, ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది...వంటి వివరాలు బులెటీన్ లో ఉంటాయి

ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవల మీద  ప్రతి నెలా  హెల్త్ బులెటిన్ విడుడలవుతుంది. దీనితో  ఈ సర్వీసుల సమాచారం పూర్తిగా ప్రజలందరికి తెలుస్తుంది. ఈ సేవల గురించి చాలా మందికి  పెద్ద తెలియదు.  అందుకే వాటిని వినయోగించుకోలేక పోతున్నారు. ఈ సేవల గురించి ప్రజలందరికి తెలియచేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెల్త్ బులెటీన్ విడుదల చేయాలని  నిర్ణయించారు. సిటి స్కాన్, ఎక్స్‌రే, ల్యాబ్, డయాలసిస్ తదితర ఉచిత సేవలకు సంబంధించి హెల్త్ బులెటీన్ల ద్వారా నెలనెలా ప్రజలకు సమాచారం అందిస్తారు. ఉచిత వైద్య సేవలు ఎంతమందికి ఉపయోగపడుతున్నాయి, ఎక్కడ ఏ సర్వీసులన్నాయి, ఎక్కడ పరికాలు పనిచేస్తున్నాయి, ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తున్నది...వంటి వివరాలు  బులెటీన్ లో ఉంటాయి. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుుడు కలెక్టర్ సమావేశంలో  వెల్లడించారు. ఇలాంటి కీలకమయిన సమాచారాన్ని ప్రజలకు అందివ్వాలనుకోవడం ఇదే ప్రథమం. డయాగ్నోస్టిక్ పరీక్షలనునెల్లూరు, ప్రకాశం జిల్లాలు సంపూర్ణంగా వినియోగించుకుంటున్నయాని ఆయన చెప్పారు.

వికలాంగుల సంక్షేమం దృష్ట్యా ఆన్‌లైన్‌లో మీసేవా ద్వారా డిజెబులిటీ  సర్టిఫికేట్ కూడా అందిస్తారని ఆయన చెప్పరు.
గిరిజన ప్రాంతాలలో పనిచేసేందుకు ముందుకు వచ్చే వారికి అదనపు జీతాలివ్వండని ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
గిరిజన ప్రాంతాలలో వేగంగా వైద్య సేవలు అందించేందుకు బైక్ అంబులెన్సులు ప్రవేశపెట్టాలి. గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కచ్చితంగా 24 గంటలు పనిచేయాలి. పేదవాళ్ల కంటి సమస్యలను తొలగించడానికి 115 విజన్ సెంటర్లను ఏర్పాటుచేస్తాం. సీజనల్ వ్యాధులు ఎప్పుడొస్తాయనేది ప్రతి ఏడాది తెలిసిన విషయమే. దానికి తగిన ప్రణాళికలు వేసుకోవడం సీజన్‌కు ముందే చేయాలి. దీనికి ఎవరో వచ్చి దిశానిర్దేశం చేస్తారని ఎదురు చూడకూడదు.

గిరిజన ప్రాంతాలలో పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకంగా అదనపు వేతనం ఇవ్వండని కూడా ఆయన ఆదేశించారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడమే లక్ష్యంగా 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేశారని చెబుతూ  దీనికి సబంంధించిన  పోస్టర్  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేశారు.  గృహ హింస, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి సమస్యలకు 181 ద్వారా పరిష్కారం, తక్షణ సాయం అందాలని కూడా ఆయన ఆదేశాలిచ్చారు. కడప, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో కొత్తగా క్యాత్ ల్యాబుల ఏర్పాటు  చేయాలని ఆదేశాలిచ్చారు.
 

మరిన్ని వార్త ల కోసం క్లిక్ చేయండి 

loader