తెలంగాణ అమ్మాయికి షాక్ ఇచ్చిన ఆంధ్రా అబ్బాయి

First Published 23, Nov 2017, 3:25 PM IST
andhra boy cheated telanagan girl in facebook
Highlights
  • పోలీస్ స్టేషన్ కి చేరిన మరో ఫేస్ బుక్ ప్రేమ
  • తెలంగాణ యువతిని మోసం చేసిన ఆంథ్రా కుర్రాడు
  • ఆంథ్రా కుర్రాడిని అరెస్టు చేసిన  పోలీసులు

ఓ తెలంగాణ అమ్మాయికి.. ఆంధ్రా కుర్రాడు షాక్ ఇచ్చాడు. అది కూడా ఫేస్ బుక్ ద్వారా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ వేదికగా ప్రేమించుకొని.. చివరికి మోసపోయామంటూ పోలీసుస్టేషన్ గడప తొక్కుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి సంఘటనే ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది. ఒక తెలంగాణ అమ్మాయి.. ఆంధ్రా కుర్రాడిని ప్రేమించి దారుణంగా మోసపోయింది.

అసలేం జరిగిందంటే... తెలంగాణలోని నకిరేకల్ మండలానికి చెందిన యువతికి ఆంధ్రాకి చెందిన ఓ యువకుడు ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ఆ యువకుడు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందినవాడు కాగా.. దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.  దుబాయిలో ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి.. అతన్ని పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుందని ఆ యువతి భావించింది. దీంతో.. అతను చెప్పిందల్లా చేయడం మొదలుపెట్టింది.

ఒకరోజు ఫేస్ బుక్ వీడియో చాట్ లో నగ్నంగా కనిపించమని ఆ యువకుడు కోరగా.. అందుకు ఆ యువతి అంగీకరించింది. అయితే.. ఆ అమ్మాయి నగ్నంగా ఉన్న వీడియోని ఆ యువకుడు రికార్డు చేశాడు. అంతేకాకుండా ఆ వీడియోలను ఇంటర్నెట్ లో పెడతానంటూ యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. అతని బెదిరింపులతో యువతి ఒక్కసారిగా ఖంగుతిన్నది. వెంటనే పోలీసు స్టేషన్ ని ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు యువకుడిని ముంబయి ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు.

 

loader