జగన్ కు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఫోన్వెంకయ్యనాయుడికి మద్దతు కోరిని షామద్దతు ప్రటించిన వైసిపి నేత

ఉప రాష్ట్రపతి పదవికి ప్రతిపక్ష పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ మద్ధఎన్డీఏ అభ్యర్థి వెంకయ్యనాయుడికి మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరు ఖరారు కాగానే ఆయనకు మద్దతు నీయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సోమవారం రాత్రి తనకు ఫోన్‌ చేశారని , ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు పేరును ప్రతిపాదించిన విషయాన్ని తెలియచేసి మద్దతు కోరారని జగన్‌ పేర్కొన్నారు.

అమిత్‌ షా అభ్యర్థనపై జగన్ సానుకూలంగాస్పందించారు. తెలుగువాడైన వెంకయ్యనాయుడుకు తెలుగువారిగా కూడా వైఎస్సార్‌సీపీ మద్దతు ఇస్తున్కనదని ఆయన అమిత్‌ షాకు తెలిపారు.

‘రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, స్పీకర్‌ వంటి ఉన్నత రాజ్యాంగ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నిక జరగాలి. అలాంటప్పుడే ఏ పార్టీకీ చెందని వ్యక్తులుగా ఆ పదవుల్లో ఉన్న వారు వ్యవహరించే పరిస్థితి నెలకొంటుంది. ఇది మేము మొదటినుంచీ చెబుతూ వస్తున్న విధానమే, అని జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.