ఘనంగా ఈశా అంబానీ ఎంగేజ్ మెంట్ పార్టీ.. హాజరైన బాలీవుడ్ సెలబ్రెటీలు

Ambanis Throw Bash To Celebrate Daughter Isha's Engagement. See Photos
Highlights

హాజరైన బాలీవుడ్ సెలబ్రెటీలు

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం సంబరాల్లో మునిగితేలుతోంది. ఆయన గారాలపట్టి ఈశా అంబానీ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఈ శుభ సందార్భాన్ని గ్రాండ్ పార్టీ ఇచ్చి మరింత ఆనందంగా జరుపుకుంది అంబానీ ఫ్యామిలీ. ఈ గ్రాండ్ పార్టీకి బాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు క్రికెటర్లు హాజరయ్యారు.

ముకేశ్‌ తనయ ఈశా అంబానీ.. ప్రముఖ యువ వ్యాపారవేత్త, పిరమాల్‌ సంస్థల వారసుడు ఆనంద్‌ పిరమాల్‌ను త్వరలో పెళ్లిచేసుకోనున్నారు. రెండు రోజుల క్రితమే ఈ వార్త బయటకొచ్చింది. కాగా.. ఈ ఆనంద సమయాన్ని మరింత ఆనందంగా జరుపుకుంటున్నాయి అంబానీ, పిరమాల్‌ కుటుంబాలు. సోమవారం రాత్రి ఈశా ఎంగేజ్‌మెంట్‌ పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌, బాలీవుడ్‌ ప్రముఖులు షారూక్‌ఖాన్‌, ఆమీర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, కరణ్‌జోహార్‌ తదితరులు హాజరయ్యారు. ముకేశ్‌, ఆయన సతీమణి నీతా అంబానీ దగ్గరుండి అతిథులను ఆహ్వానించారు.

ఈశా, ఆనంద్‌లు చాలా కాలాంగా మంచి స్నేహితులు. అంతేగాక వీరి కుటుంబాల మధ్య 40ఏళ్లుగా స్నేహబంధం కొనసాగుతోంది. ఇటీవలే ఈశాతో ఆనంద్‌ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా.. అందుకు ఆమె కూడా అగీకరించారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకుని కలిసి విందు చేసుకున్నారు. ఈశా, ఆనంద్‌ల వివాహం డిసెంబరులో చేయాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

కాగా.. ఇప్పటికే ఈశా కవల సోదరుడు ఆకాశ్ అంబానీ వివాహం కూడా నిశ్చయమైన విషయం తెలిసిందే. ప్రముఖ వజ్రాల వ్యాపారి రస్సెల్‌ మెహతా కుమార్తె శ్లోకతో ఆకాశ్ నిశ్చితార్థం ఇటీవల ఘనంగా జరిగింది. వీరి వివాహం కూడా డిసెంబరులోనే జరగనుంది. 

loader