మంత్రిపై దుండగుడి కాల్పులు

Ahsan Iqbal escapes attempt on life
Highlights

పాకిస్థాన్ మంత్రిపై హత్యాయత్నం

పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎహసాన్ ఇక్బాల్‌పై హత్యాయత్నం జరిగింది. మంత్రి ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని తన సొంతూరు నరోవల్‌లో ఓ సభలో ప్రసంగించారు. అనంతరం తన వాహనంలో కూర్చొన్న సమయంలో ఓ వ్యక్తి మంత్రిపై కాల్పులు జరిపాడు. దీంతో మంత్రి కుడి భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దాదాపు 18 మీటర్ల దూరంలో నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నది. పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మాట్లాడుతూ దుండగుడు మంత్రికి అతిసమీపానికి ఎలా వచ్చాడు.. కాల్పులు ఎందుకు జరిపాడు తదితర విషయాలపై దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. దుండగుడు నరోవల్ ప్రాంతానికి చెందినవాడని పేర్కొన్నారు. మరోవైపు కాల్పులను పాకిస్థాన్ ప్రధాని అబ్బాసీ ఖండించారు.
 

loader