రైల్వే ప్రయాణికులు... ఇక దానికి కూడా ఆధార్ తప్పనిసరి

First Published 8, May 2018, 1:57 PM IST
Aadhaar may become mandatory to book rail tickets
Highlights

ఇంట్రెస్టింగ్ న్యూస్..
 

ఇక నుంచి రైల్వే టికెట్ బుక్ చేయాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇటీవల రైల్వేశాఖకు అందిన ఓ నివేదికలో ఈ మేరకు సిఫార్సులు చేశారు. ఈ సిఫార్సులను పరిశీలిస్తున్న రైల్వేశాఖ టికెట్‌ బుకింగ్‌కు ఆధార్‌కార్డును తప్పనిసరి చేయాలనే యోచనలో ఉన్నట్లు సమచారం.

ఇటీవల ముంబయిలో రైల్వే టికెట్ల రాకెట్‌ గుట్టు బయటపడింది. దీనిపై విచారణ చేపట్టిన రైల్వే అధికారులు సల్మాన్‌ఖాన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి నుంచి దాదాపు రూ. 1.5కోట్ల విలువ గల ఈ-రైల్వే టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సల్మాన్‌ను విచారించేందుకు సెంటర్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ రైల్వే సిస్టమ్‌(సీఆర్‌ఐఎస్‌) నుంచి కొందరు సీనియర్‌ అధికారులు సోమవారం ముంబయికి వచ్చారు.

సల్మాన్‌ను విచారించిన అనంతరం సీఆర్‌ఐఎస్‌, ఐఆర్‌సీటీసీ సాంకేతిక నిపుణులు సంయుక్తంగా ఓ నివేదిక తయారుచేశారు. ఇందులో టికెట్ల రాకెట్‌ను అడ్డుకునేందుకు కొన్ని సిఫార్సులు చేశారు. ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రయాణికుల యూజర్‌ ఐడీలను వారి ఆధార్‌ కార్డులతో అనుసంధానం చేయాలని నివేదికలో పేర్కొన్నారు. అంతేగాక.. book now బటన్‌ నొక్కగానే ప్రయాణికుల మొబైల్‌ఫోన్‌కు ఓటీపీ వచ్చేలా సిస్టమ్‌ను మార్చాలని ప్రతిపాదించారు.

ఈ నివేదికను రైల్వేశాఖకు అందించారు. ప్రస్తుతం ఈ సిఫార్సులను రైల్వే ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. వీటిని అమలు చేయాలనే యోచనలో రైల్వేశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

loader