ఆ రాత్రి ఏదోలా నిద్ర మేల్కొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నపళంగా వచ్చిన వరద తగ్గుతుందని చూస్తుంటే ..పక్కన ఎంతో బాధ పడుతున్న ఒక అన్న
పూల బజార్ లో తనది బట్టల షాప్ ..అన్న అంటే నా వైపు తిరిగి నా జీవితాంతం కస్టపడి అప్పులు చేసి కొన్న బట్టలన్నీ నీళ్లల్లో పూర్తిగా మునిగిపోయాయి..
 20 లక్షల కు పైనే సరుకు ఉంటుంది నా షాప్ కు ఇన్సూరెన్స్ కూడా లేదు అని ఏడుస్తున్న అన్న ని ఓదార్చడం ఎవరి తరం కాదు..
 ఒకవైపు చిరంజీవి పార్క్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం ఇంకో వైపు నీళ్ళు తీవ్రత ఇంకా పీయూగుతూనే వుంది పోలీస్ లు వచ్చి మముల్ని వెంటనే
కర్నూల్ బయటకు పొండి సాయంత్రం సరికే పట్టణం అంతా మునగ బోతుంది అని పిడుగులాంటి వార్త చెప్పాడు. సర్ బోట్ లో మేము వస్తాం మా షాప్ ఎలా వుందో చూస్తాం అంటే అయన మేం మనుషులు ఎవరన్నా చిక్కుకున్నారేమో అని కాపాడటానికి పోతున్నాం అంటే
నేను వస్తా సర్ మీకు హెల్ప్ గా అని బోటు ఎక్కాము...
  పోతుంటే దారిలో ఇళ్ళన్నీ ధాధాపు 20 అడుగుల పైనే మునిగిపోయాయి పూల బజార్ దగ్గర ఒక మీడ మీద
ఒక 5 మంది హెల్ప్ హెల్ప్ అని అరిస్తే వారి దగ్గరికి పోయి
అన్నం పోట్లాలు వాటర్ బాటిల్స్ వేసి వస్తుంటే వాళ్ళు
మేము వస్తాం అంటే ఈ బోటు లో పట్టరు..
 Ndrf దళాలు వచ్చే వరకు ఆగాల్సిందే అని అధికారి చెప్తే సర్ ఎందుకు రాలేదు అని అదిగితే మన ధగ్గర లైఫ్ బోట్స్ లేవు వారు రావాలంటే తుంగ భద్ర బిరిడ్జి ఎక్కి నీళ్ళు పార్ధున్నాయి దటలంటే కుదరదు అన్నారు ..
 ఇంతలో ఫోన్ రింగ్ అయితే యెత్తరు సర్ తుంగ భద్ర వంతెన కొట్టుకు పోయిందంట హైదరాబాద్ నుండి రావాలంటే హెలికాఫ్టర్ ఒక్కటే మార్గం అన్నారు..
  మధ్యలో ఇంటి పైన సారుకులతో ఒకాయన నిలబడి వున్నాడు .ఒక్కడే ఉంటె రా పోదాం అంటే అయన ససేమిరా అంటే నేవున్న ప్రదేశం కూడా సాయంత్రం లోపు పూర్తిగా మునుగుతుంది నీవు బోటు ఎక్కితే బతుకుతావ్ లేకుంటే సస్తవ్ అంటే ..అయన కొంచెం మెత్తబడి నా సామాన్లు కొన్ని తెచ్చుకుంటా అన్నాడు నీవు బంగారు,డబ్బు తప్ప ఏమితెచ్చినా ఎక్కద్దు అంటే అయన
ఏడుపుమొకం తో ఎక్కాడు.
 ఏమి షాప్ అంటే కిరాణా షాప్ సర్ 15 లక్షల సరుకులు షాప్ లోను ఇంకో 30 లక్షల సరుకులు గోడవన్ లో వున్నాయి అన్నాడు..
 దారిలో ఎన్ని కార్లు బండ్లు పూర్తిగా మునిగిపోయాయి...
 ఇంతలో మాకెదురుగా ఇద్దరు యువకులు లోపలకి వెళ్లబోతే పోలీసులు నిలువరిస్తున్నారు ఏమి అంటే సర్
మేం పని మీద ఊరికి పొఇంటిమి మా ఇంట్లో మా 10,ఇంటర్,బి టెక్ సిర్టిఫికెట్లు వున్నాయి జిరాక్స్ కూడా లేవు మా అన్న పాస్ పోర్ట్ ఆస్థి పత్రాలు అన్ని ఉన్నాయ్
మేం పోతాం అంటే వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు....
    ఇంతలో సర్ మా పెద్దమ్మ వాళ్ళు అక్కడే వున్నారు
పొద్దున్న నుండి కనిపించలేదు ఫోన్ చేయలేదంటే..
 ఎక్కించుకొని బోటు లో వెళ్లి చిస్తే అక్కడ ఉన్న ఇల్లు
పూర్తిగా నేలమట్టం ఐ నీళ్ళు పరుతున్నాయి..
  కొంచెం దూరం లో 3 వ ఫ్లోర్ వాళ్ళను అడిగితే సర్
వాళ్ళు ఇద్దరు రాత్రి పైకి ఎక్కారు ఒక్కసారిగా నీళ్ళు
రావడం తో ఇల్లు పాతది కదా కుప్పకుల్యింది..
వాళ్ళు ఆ ఇంటి కిందే సమాధి అయ్యారు ..
    సర్ కొండారెడ్డి బురుజు దగ్గరకి నీళ్ళు చేరుతున్నాయంట ఆ కాలనీ వాళ్ళు ఇల్లు కలిచేసేకి ససేమిరా అంటున్నారు ఎం చెయ్యాలి..అంటే
ఎలాగైనా వారిని కాళీ చూపించు లేకుంటే వాళ్ళ
ప్రాణాలకే ప్రమాదం..
   ఇంతలో ఎవరో ఫోన్ లో రేయ్ టీవీ లో ఇప్పుడే చూపిస్తున్నారు కేంద్ర జలవనరుల శాఖ చెప్పిందంట
గత 100 సంత్సరాల్లో ఎప్పుడు రాణి వరద రబోతుందంట
మీరు కాళీ చేయండి అంటే వీడు పెద్దగా నవ్వి మా ఇల్లు
నిన్న రాత్రే సగం మునిగింది ఇప్పుడు పూర్తిగా మునిగి పోయింది ఇప్పుడు చెప్పి ఎం లాభం ఇంకా రేపు చెప్పవాల్సింది అని పెట్టేసాడు..
   ఇంతలో నది గుండా రెండు ఎద్దులు కొట్టుకుపోతున్నాయి..కాపాడే వారె లేరా అంటే..
 మనుషులు పోతుంటే నే కపడలేకప్వుతున్నాం..ఇంకా
మూగ జీవులకు దిక్కేవారు..
  సగానికి పైగా కర్నూల్ నీట మునిగింది..
ఒక.వైపు తుంగభద్ర ఇంకో వైపు హంద్రి మరో వైపు kc
కెనాల్ నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి..
 బస్టాండ్,కొండారెడ్డి బురుజు,రాజ్విహార్ సిర్కిల్ మొత్తము మునిగాయి..
  చూస్తుంటేదగానే చీకటి పడింది వాన పూర్తిగా ఆగిపోయింధీ..ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిల్టర్ లో ఆ రాత్రి గడసిపోయింది...
     పొద్దున్నే లేచి చూస్తే పరిస్థితులు ఏ మాత్రం మారలేదు
నీళ్ళు ఎక్కడికక్కడ ఆగిపోయాయి..
  శ్రేశైలం డాం పట్టక బ్యాక్ వాటర్ రూపం లో ఉన్న నీళ్ళని
అప్పటికి అర్థం అయింది...
  (ఇంకా ఉంది..)

(మొదటి భాగం ఇక్కడ చదవండి)

 

 

 

 

 

*రచయిత రాజశేఖర్ రెడ్డి బ్లాగర్,కాలమిస్టు