‘‘ఆడవారి మనసులో ఏమి ఉంటుందో ఆ బ్రహ్మ దేవుడికి కూడా తెలీదు.. మగవారైతే.. వాళ్లు ఏమనుకుంటున్నారో ఈజీగా కనిపెట్టేయచ్చు..’’ అని చాలా మంది అనుకుంటుంటున్నారు. అయితే.. నిజానికి ఇది పూర్తిగా వాస్తవం కాదు. ఆడవారి మనసులో ఏముందో నిజంగా కనిపెట్టలేకపోవచ్చు.. కానీ  మగవారిలో మనసులోని విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు అనే వాదనలో నిజం లేదు. ఎందుకంటే.. నిజంగా అబ్బాయిలు.. అమ్మాయిల నుంచి ఏమి ఆశిస్తారో తెలుసా..? అమ్మాయిల గురించి అబ్బాయిల మనసులో ఏముంటుందో తెలుసా..? చాలానే ఉంటాయి.. కానీ అబ్బాయిలు ఈ విషయాలను బయటకు చెప్పకుండా దాచిపెడతారు. మరి ఆ విషయాలేంటో తెలుసుకోవాలనుకుందా.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..

1. రెస్పెక్ట్..

రిలేషన్ లో ఉన్న ప్రతి అబ్బాయి.. తన లవర్/ గర్ల్ ఫ్రెంట్/ భార్య దగ్గర నుంచి రెస్పెక్ట్ ఆశిస్తాడు. కానీ.. ఆ విషయానికి వారికి నేరుగా చెప్పడు. మీరు నిజంగా వాళ్లని ప్రేమించే వ్యక్తి అయితే.. మరి మనసు అర్థం చేసుకొని వారి ఆలోచనలను, నిర్ణయాలను గౌరవించండి

2.సహాయం..

తన గర్ల్ ఫ్రెండ్, భార్యకి ఏదైనా అవసరమైతే మొదట తననే అడగాలి అని అబ్బాయిలు కోరుకుంటారు. మీరు ఇండిపెండెంట్ స్ట్రాంగ్ వుమెన్ అయి ఉండొచ్చు. కానీ.. చిన్న చిన్నపనులలో మీ పార్టనర్ ని సహాయం కోరితే.. వారు చాలా హ్యాపీగా ఫీలౌతారట.

3.కాంప్లిమెంట్స్..

అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలు కూడా కాంప్లిమెంట్స్ ఆశిస్తారు. కాబట్టి.. సందర్భానుసారం..మీరు వారికి కాంప్లిమెంట్స్ ఇస్తే వారు ఫుల్ ఖుషీ అవుతారు.

4.గుడ్ ఫ్రెండ్..

రిలేషన్ షిప్ అనేది ఇద్దరి సపోర్ట్ తో నడుస్తుంది. భార్య, భర్తలు ఇద్దరికీ విడివిడిగా చాలా మంది స్నేహితులు ఉండి ఉండొచ్చు. కానీ.. భార్య.. భర్తకి నిజమైన స్నేహితురాలిలా ఉండాలట. అప్పుడు వారి బంధం మరింత బలపడుతుంది. అంతేకాకుండా భర్త తన సంతోషాలను, బాధలను అన్నింటినీ షేర్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్క అబ్బాయి కోరుకునే వాటిలో ఇది ముఖ్యమైనది.

5.అడ్వైజ్..

మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు మొదటగా మీ బాయ్ ఫ్రెండ్/భర్తని సలహా అడగండి. వాళ్లు మీ నుంచి అదే ఆశిస్తారు. వారి సలహా తీసుకుంటే.. మీకు వారిపై నమ్మకం, గౌరవం ఎక్కువగా ఉందనే విశ్వాసం వారిలో కలుగుతుంది.

6. ఇండిపెండెంట్..

మీకు వివాహం అయినప్పటికీ.. మీ భర్తని స్వతంత్రంగా జీవించనివ్వాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో వారిని ఒంటరిగా ఉండనివ్వాలని అబ్బాయిలు కోరుకుంటారట. ఈ విషయంలో మీరు వారిపై ఒత్తిడి పెట్టకుండా ఉండాలని వారు కోరుకుంటారు. అంతేకాకుండా వారి ఫ్రెండ్స్ తో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారట.