ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారులు మృతి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆక్సిజన్ అందక ఉత్తరప్రదేశ్లోని గోరఖ్‌పూర్ లో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో 30 మంది పిల్లలు చనిపోయారు. గత మూడు రోజులగా చిన్న పిల్లలు మెదడువాపు వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వీరంతా 48 గంటల వ్యవధిలోనే చనిపోయారని అక్కడి ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

అయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల క్రితం ఆస్పత్రిని సందర్శించారు. ఇప్పుడు ఇలా జరగటం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఆ చిన్నారుల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
