మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన 18 ఏళ్ల యువకుడు

3 Year Old Allegedly Raped By 18 year Old Boy In up
Highlights

విషయం బైటపడకుండా చిన్నారిని చంపే ప్రయత్నం

అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఉత్తరప్రదేశ్ జిల్లాలో చోటుచేసుకుంది. పాపం చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపించిన యువకుడు ఇంట్లోకి తీసుకెళ్లి అత్చాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయాన్ని బైట పెడితే తన పరువు పోతుందని భావించి చిన్నారిని హతమార్చడానికి ప్రయత్నించాడు. అయితే  ఏడుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని చిన్నారిని కాపాడారు. 

ఈ అఘాయిత్యానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యూపిలోని రాంపూర్‌కు చెందిన ఓ 18 ఏళ్ల యువకుడు తన  పొరుగింట్లో ఉండే మూడేళ్ల చిన్నారిపై
కన్నేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిచాడు. అనంతరం చిన్నారిపై  పైశాచికంగా లైంగిక దాడి చేశాడు. ఈ వికృత చేష్టలకు భయకంపితురాలైన చిన్నారి ఏడవటం మొదలుపెట్టింది. దీంతో తాను చేసిన ఈ నీచపు పని ఎక్కడ బైటపడుతుందోనని పాపను హతమార్చడానికి ప్రయత్నించాడు. గాలి ఆడకుండా ఉండే ఓ చిన్న డబ్బాలో పాపను కుక్కి తాళం వేసి అక్కడినుండి పరారయ్యాడు. అయితే యువకుడి ఇంట్లోంచి పాప ఏడుపు వినబడటంతో ఇంట్లోకి ప్రవేశించిన స్థానికులు డబ్బాలోంచితీసి పాపను కాపాడారు.  

ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అభం శుభం తెలియని తమ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను కోరారు.
 

loader