బీహార్ లో గురువారంనాడు ఘోరమైన ప్రమాదం సంభవించింది. 

పాట్నా: బీహార్ లో గురువారంనాడు ఘోరమైన ప్రమాదం సంభవించింది. మోతీహరి ప్రాంతంలో బస్సులు అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో బస్సులో మంటలు లేచాయి. ఈ ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 

సమాచారం అందిన వెంటనే పోలీసులు, రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు వారికి సాయపడుతున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. 

ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహారీ ప్రాంతంలో గల కోట్వా పోలీసు స్టేషన్ పరిధిలోని బెల్వా గ్రామం వద్ద గురువారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది ముజఫర్ పూర్ కు చెందినవారు. 

మృతుల కుటుంబాలకు బీహార్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ రిలీఫ్ మంత్రి దినేష్ చంద్ర యాదవ్ రూ. 4 లక్షలేసి నష్టపరిహారం ప్రకటించారు.