రాజస్థాన్ లో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రాత్రి శక్తివంతమైన ఇసుక తుఫాను సంభవించింది.
జైపూర్: రాజస్థాన్ లో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గత రాత్రి శక్తివంతమైన ఇసుక తుఫాను సంభవించింది. ఈ ఘటనలో 27 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.
తూర్పు రాజస్థాన్ లోని ఆల్వార్, ధోల్పూర్, భరత్ పూర్ ప్రాంతాల్లో దాని తాకిడి తీవ్రంగా ఉంది. దాంతో విద్యుత్ కనెక్షలు తెగిపోయాయి. చెట్లు నేలకూలాయి. ఇళ్లు కూలిపోయాయి. మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆల్వార్ లో గత రాత్రి నుంచి చిమ్మచీకటి అలుముకుంది. చెట్లు కూలిపోయి విద్యుత్ స్తంభాలు తెగిపోవడంతో కరెంట్ సరఫరా ఆగిపోయింది. భరత్ పూర్ లో నష్టం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలోనే 11 మంది మరణించినట్లు తెలుస్తోంది.
బాధితులకు వెంటనే సహాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా అధికారులను ఆదేశించారు. మృతుల కుటంబాలకు సానుభూతిని తెలియజేశారు.
సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత అశోక్ గెహ్లాట్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఇసుక తుఫాను, భారీ వర్షం ఢిల్లీని కూడా తాకింది. రెండు అంతర్జాతీయ విమానాలతో పాటు 15 విమానాలను దారి మళ్లించారు.
రాజస్థాన్ లోని చాలా ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం వేడి గాలులు వీచాయి. కోటలో 45.4 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇసుక తుఫాను, వేడి గాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కార్యాలయం తెలియజేసింది.
#WATCH: Dust storm lashes #Rajasthan's Alwar, 2 people have died in the area due to accidents because of the sudden weather change. pic.twitter.com/GKgRnZI15T
— ANI (@ANI) May 2, 2018
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated May 3, 2018, 11:40 AM IST