2015 లో ఢిల్లీ, బీహార్ ప్రజలే మోదీ మీద ఆగ్రహించారు. 2016 లో ఈ ఆగ్రహం దేశమంతా పాకింది

మరొక వారం రోజుల్లో ముగియనున్న2016 ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రం అచ్చిరాలేదు. ఈ ఏడాది ముగింపు బరువుగా, బాధగా ఉంటున్నది. అంతేకాదు, 2017 ఓపెనింగ్ బ్యాలన్స్ ఇమెజ్ డామేజ్.

ఈ దరిద్రపు గొట్టు సంవత్సరం 2016(టోటల్ 9) మోదీకి ముచ్చెమటు పట్టించి. నిద్రలేకుండా చేసి వెళ్లిపోతావుంది. ఉత్తుత్తి ఉపన్యాసాలు ఎంతోకాలం పనిచేయవని మరొక సారి రుజువు చేసింది. 2015 రాజకీయంగా దెబ్బతీస్తే, 2016 ఆ వూపు ను కొనసాగిస్తూ , తనని, తన ప్రతిష్టను, చివరకు బిజెపి ప్రతిష్టను కూడా మంట కలిపింది.

2014 లో బంపర్ మెజారిటీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఉపన్యాసాలు, అడ్వర్టయిజ్ మెంట్లు, నవరాత్రిఉపవాసలు తప్ప ఏమీ లేవు. అందుకే 2015 లో ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ వేసిన వేటు గాటుఇంకా మానలేదు. బీహార్లో నితిష్ కుమార్ అంతకంటే పెద్ద దెబ్బ వేశారు. రు. 2 లక్షల 25 వేల కోట్లు ప్రత్యేక కానక ఇస్తానన్న కూడా బీహారోళ్లు మోదీ మాయలో పడలేదు.

2015 లో ఢిల్లీ, బీహార్‌లు మోదీ స్పీడ్‌ కు బ్రేకులేశాయి.

2016 మోదీని ఇంకా అవమానం పర్చింది. 2015 నుంచి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. బిజెపి లో సీనియర్లు మరీ దూరమయ్యారు. చంద్రబాబు నాయుడు సపోర్టు చేస్తున్నాడో, విమర్శిస్తున్నాడో తెలియడం లేదు. ఒకే ఒక్క లాభం.. . తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తన వైపు నిలబడటమో కాదు, ఈగ వాలకుండా చూస్తున్నాడు.

2016లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగగా ఒక్క అసోంలో తప్ప ఎక్కడా బిజేపీ గర్వపడేలా మోదీ సీట్లు తీసుకు రాలేదు.

ఈ రాష్ట్రాల్లో 2014 సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్‌ శాతంకన్నా తక్కువ ఓట్ల శాతం లభించింది.

 దీంతో అక్కడక్కడ మున్సిపల్ ఎన్నిక ల విజయాలనే మోదీ మహా విజయాలుగా చెప్పుకునే దర్గతి 2016 లో బిజెపికి పట్టింది.

గతంలో మిత్రుడినంటూ ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు బిజెపికి దూరం జరుగుతున్నట్లు కనిపిస్తుంది.

జయలలిత మృతి తర్వాత దురాశతో దుర్బుద్ధితో తమిళ రాజకీయ తల దూర్చేందుకు చూస్తున్నాడు మోదీ. ఇది 2017 లో అన్నాడిఎంకే శ్రేణులకు ఆగ్రహం తెప్పించక మానదు.

నోట్ల రద్దు మోదీ కష్టాలకు పరాకాష్ట. మిస్టర్‌ క్లీన్‌ అంటూ బిజెపి అకాశానికెత్తిన మోడీకి కళంక పడ్డారు. ఆయన స్వయంగా 40 కోట్లు తీసుకున్నట్లు రికార్డు దొరికింది 2016 లోనే. కనీసం 2017 లో నయినా మోదీ కోలుకుంటాడా....