అభం శుభం తెలియని 14 ఏళ్ల చిన్నారిని ఓ కామాందుడు గర్భవతిని చేసిన సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిన్నారికి మాయమాటలు చెప్పి లోభర్చుకుని పలుమార్లు అత్యాచారం చేసి గర్భానికి కారణమైన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చింతపల్లి పోలీసుల కధనం ప్రకారం నర్సర్లపల్లి గ్రామానికి చెందిన గంగిడి పద్మ, వెంకటయ్య ల కుమారుడు శివ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఇదే గ్రామానికి చెందిన బాలికకు మాయ మాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. చిన్నారిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పాల్పడ్డాడు. అయితే ఈ మద్య బాలిక ఆరోగ్య పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆస్పిటల్ కి తీసుకువెళ్లి పరీక్షలు చేయగా అసలు నిజం బయటపడింది. ఆమె ఐదు నెలల గర్భవతి అని డాక్టర్లు తెలపారు. దీంతో తల్లిదండ్రులు బాలికను నిలదీయగా అసలు నిజం బైటపెట్టింది.    

దీంతో బాలిక తల్లిదండ్రులు శివపై చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మైనర్‌ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నల్లగొండ జిల్లా ఆస్పత్రికి తరలించగా, నిందితుడు శివపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.