డబ్బుల కోసం ఫుడ్ డెలివరీ బాయ్ ను వెంటాడి మరీ దాడి చేశారు కొంతమంది దుండగులు. వారినుంచి తప్పించుకుని.. కత్తిపోట్లతో, తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రికి చేరుకుంటే వైద్యుల నిర్లక్ష్యం అతడి ప్రాణాలు తీసింది.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని భోపాల్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న ఓ కుర్రాడి పై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు కొంతమంది దుండగులు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య ఆస్పత్రికి వెళ్లిన ఆ యువకుడికి అక్కడ నిర్లక్ష్యమే ఎదురయ్యింది. ఎలాగైనా బతకాలన్న అతడి ఆశ నిరాశే అయ్యింది. చికిత్స ఆలస్యం కావడంతో ఓ నిండు ప్రాణం బలైపోయింది.
మధ్యప్రదేశ్ ఇండోర్ బాన్ గంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం జరిగింది. సునీల్ వర్మ అనే 20 ఏళ్ల యువకుడు డిగ్రీ చదువుతూనే జోమటో ఫుడ్ డెలివరీ యాప్ లో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి తన మోటార్ బైక్ మీద అరవింద సమేత లోని కరోల్ బాగ్ వద్ద ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళుతుండగా ముగ్గురూ అతన్ని బైక్ ల మీద వెంబడించారు. అతన్ని అడ్డగించి కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో స్వయంగా బండి నడుపుతూనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నాడు ఆ యువకుడు.
పిజ్జా డెలివరీ బాయ్ సాహసం.. మంటల్లో చిక్కుకున్న ఐదుగురు చిన్నారులను కాపాడిన సూపర్ హీరో..
అయితే ఆస్పత్రిలోనూ అతనికి సకాలంలో చికిత్స అందలేదు. వైద్యులు ఆలస్యంగా చికిత్స ప్రారంభించడంతో పరిస్థితి విషమించింది. దీంతో మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి అతను కన్ను మూసాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతన్ని ముగ్గురు వెల్లడించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. శరీరంలో ఐదు కత్తిపోట్లు ఉన్నాయని, దొంగతనం లో భాగంగా పెనుగులాటలో అతని బ్యాగు తిరిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఘటన మీద పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు నిందితులను పట్టుకుంటామని ఇండోర్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు టైంకు చికిత్స అందించిన ఆసుపత్రి వర్గాల పైన కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిలా ఉండగా, జూన్ 6న కోయంబత్తూర్ లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కోయంబత్తూర్‌లో ఓ పోలీస్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బాయ్ ను చెంపదెబ్బల కొట్టాడు. ఆ వీడియో వైరల్ గా మారడంతో ఆ పోలీసును అరెస్టు చేశారు. అంతేకాదు, అధికారులు అతడిని విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. పోలీసు చేసిన పనితో బాధితుడికి తమిళనాడు రాష్ట్ర డీజీపీ ఫోన్ చేసి మరీ పరామర్శించారు. అతడి ఆరోగ్యవివరాలను అడిగి తెలుసుకున్నారు. అతడి మీద దాడికి పాల్పడిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
వివరాల్లోకి వెడితే.. మోహన్ సుందరం (38) అనే బాధితుడు రెండేళ్లుగా డెలివరీ బాయ్ గా స్విగ్గీలో పని చేస్తున్నాడు. రోజూలాగే డెలివరీలు చేయడానికి అవినాశి రోడ్డులో బైక్ పై వెడుతున్నాడు. ఈ సమయంలో ఓ స్కూల్ వ్యాన్ వేగంగా వచ్చింది. అది వేగంగా రావడమే కాకుండా.. రెండు వాహనాలను, పాదచారులను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఇది గమనించిన మోహన్ సుందరం ఆ వ్యాన్ ఆపేందుకు ప్రయత్నించి, చివరికి ఆపాడు. ఈ క్రమంలో అవినాశి రోడ్డు జంక్షన్ లో కొద్దిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ట్రాఫిక్ జామ్ కు కారణం డెలివరీబాయ్ నే అని అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సతీష్ భావించాడు. ఫుడ్ డెలివరీ బాయ్ ను చెంప దెబ్బలు కొట్టాడు. అతడి నుంచి ఫోన్ లాక్కున్నాడు. ఆ స్కూల్ వ్యాన్ యజమాని ఎవరో తెలుసా? అంటూ మోహన సుందరాన్ని ప్రశ్నించాడు. అనుకోని ఈ చర్యలకు ఆ డెలివరీ బాయ్ బిత్తరపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.
