YS Sharmila: నారా లోకేశ్‌కు వైఎస్ షర్మిల క్రిస్మస్ గిఫ్ట్‌లు.. ఏపీలో కలిసే ఫైట్?
నారా లోకేశ్‌కు వైఎస్ శర్మలా రెడ్డి క్రిస్మస్ కానుకలు పంపారు. ఈ గిఫ్ట్‌ను నారా లోకేశ్‌తన ట్విట్టర్‌లో ఫొటో తీసి పంచుకుడు.
Nara Lokesh: ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేడి రాజుకుంటున్నది. ముఖ్యంగా ప్రతిపక్షాల పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మార్పు చెందుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులను ధ్రువీకరించగా.. బీజేపీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. అధికార వైసీపీ వ్యతిరేక ఓటు చీలవద్దనే బలమైన కారణంతో ఈ పార్టీలు ఏకం అవుతున్నాయి. ఈ తరుణంలో వైఎస్ షర్మిలా రెడ్డి తీరు చర్చనీయాంశమైంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆమె క్రిస్మస్ గిఫ్ట్‌లు పంపించారు. ఆ గిఫ్ట్‌ను స్వీకరించిన నారా లోకేశ్ ఫొటో తీసి ట్వీట్ చేశారు. క్రిస్మస్ గిఫ్టులు పంపినందుకు ధ్యవాదాలు తెలిపారు. ఆమెకు నారా కుటుంబ సభ్యుల తరఫున శుభాకాంక్షలు చెప్పారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థి పార్టీ టీడీపీ అగ్రనేతకు ఆమె గిఫ్ట్‌లు పంపించడం చర్చనీయాంశమైంది.
జగన్‌మోహన్ రెడ్డితో వైఎస్ షర్మిలా రెడ్డికి విభేదాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణలో రాజకీయాలకు తెరలేపారు. వైఎస్సార్టీపీ పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని చెప్పి విరమించుకున్న షర్మిల.. కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ప్రకటించారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ విజయం.. ఏపీపై రాహుల్ ఫోకస్, ఈ నెల 27న ఆంధ్రా నేతలతో కీలక భేటీ
తెలంగాణ కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం అవుతుందని ఊహాగానాలు నడిచాయి. కానీ, ఆమె పార్టీ విలీనాన్ని రేవంత్ రెడ్డి వంటి సీనియర్ లీడర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి ఆమె సేవలను తెలంగాణలో కంటే ఏపీలో సరైన విధంగా ఉపయోగించుకోవచ్చని అధిష్టానానికి ఆయన సమాచారం ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ అధిష్టానం కూడా అంగీకరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే షర్మిలా రెడ్డి ఏపీ రాజకీయాల్లో అడుగు పెడతారనే ప్రచారం జరిగింది.
దీంతో షర్మిలా రెడ్డి ఏపీలో అన్నయ్య జగన్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగబోతున్నారా అనే చర్చ మొదలైంది. అదే జరిగితే.. ఓటు చీలవద్దనే ప్రయత్నాల్లో ఉన్న టీడీపీకి, జనసేనకు టచ్‌లోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అదీగాక, తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ పోటీ చేయకుండా పరోక్షంగా ఉపకరించిందనే విశ్లేషణలు ఉండనే ఉన్నాయి.