తెలంగాణలో కాంగ్రెస్ విజయం.. ఏపీపై రాహుల్ ఫోకస్, ఈ నెల 27న ఆంధ్రా నేతలతో కీలక భేటీ

పదేళ్ల తర్వాత తెలుగు గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వ్యూహాలు పక్కగా అమలు చేసి , అన్ని జాగ్రత్తలు తీసుకుని, పార్టీలోని అంతర్గ కుమ్ములాటలను సరిదిద్ది కాంగ్రెస్ పవర్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో మరో సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌పైనా హస్తం ఫోకస్ పెట్టింది.

Rahul Gandhi : congress high command focused on andhra pradesh ksp

దాదాపు పదేళ్ల తర్వాత తెలుగు గడ్డపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వ్యూహాలు పక్కగా అమలు చేసి , అన్ని జాగ్రత్తలు తీసుకుని, పార్టీలోని అంతర్గ కుమ్ములాటలను సరిదిద్ది కాంగ్రెస్ పవర్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో మరో సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌పైనా హస్తం ఫోకస్ పెట్టింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను విభజించొద్దని ఎన్ని ఉద్యమాలు, పోరాటాలు చేసినా తమ అభిప్రాయానికి విరుద్ధంగా తెలంగాణను ఏర్పాటు చేయడంపై సీమాంధ్రులు భగ్గుమన్నారు. 

దీని పర్యవసానంగా 2014, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కేశారు. దశాబ్ధాల పాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచిన ఏపీలో ఆ రెండు పర్యాయాలు ఒక్క సీటు కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది. నోటాకు వచ్చిన ఓట్ల కంటే కాంగ్రెస్‌కు తక్కువ పోలయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నేతలు వైసీపీ, టీడీపీ, బీజేపీలలో చేరిపోయారు. ఆ పార్టీల్లో చోటు దక్కనివారే ఇంకా కాంగ్రెస్‌లో వున్నారు. 

తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఏపీలో ఉనికిని చాటుకోవాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 27న ఏపీ కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మాణిక్యం ఠాగూర్‌కు ఏపీ బాధ్యతలు కూడా అప్పగించింది. 

27న జరగనున్న సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, మాణిక్యం ఠాగూర్, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరా రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, చింతా మోహన్, కొప్పుల రాజు, జేడీ శీలం తదితర నేతలు హాజరుకానున్నారు. రాహుల్ సమక్షంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే ఏపీలో కాంగ్రెస్‌తో కలిసొచ్చే పార్టీలు, నేతలపైనా దృష్టి సారించే అవకాశం వుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios