Asianet News TeluguAsianet News Telugu

ఇదేం పైశాచిక‌త్వం.. కుక్క‌ను కారుకు క‌ట్టి ఈడ్చుకెళ్లిన డాక్ట‌ర్.. వీడియో వైర‌ల్.. ఎక్క‌డ జరిగిందంటే ?

రాజస్థాన్ లో డాక్టర్ తన కారుకు కుక్కను కట్టేసి లాక్కెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 

The Rajasthan doctor who tied the dog to the car and dragged it.. Video viral..
Author
First Published Sep 19, 2022, 9:53 AM IST

రాజస్థాన్ లోని జోధ్‌పూర్ జిల్లాలో ఓ డాక్ట‌ర్ మూగ జీవిపై త‌న పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు. వీధి కుక్క‌ను కారుకు కట్టేసిట్టే దారుణంగా ఈడ్చు కెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో జంతు ప్రేమికులు ఆయ‌న‌పై తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అత‌డిపై పోలీసు స్టేష‌న్ లో జంతు హింస చ‌ట్టం కింద కేసు న‌మోదు అయ్యింది.

జార్ఖండ్‌లో మావోయిస్టుల‌కు భద్రతా బలగాలకు మ‌ధ్య కాల్పులు.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ కు గాయాలు..

వివ‌రాలు ఇలా ఉన్నాయి.  ఆదివారం ఉదయం జోధ్ పూర్ లోని శాస్త్రి నగర్ లో ప్రాంతంలో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అయిన రజనీష్ గాల్వా కారు న‌డుపుతున్నాడు. అయితే త‌న కారుకు వెన‌కాల ఓ వీధి కుక్క‌ను క‌ట్టేశాడు. పాపం ఆ కుక్క తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తున్నా ఆ కారు వేగంగా వెళ్తుండటం వ‌ల్ల ఏం చేయ‌లేక‌పోయింది. ఎంతో ఇబ్బంది ప‌డుతూ కారు వెన‌కాల ప‌రిగెత్తింది.

ఈ ప‌రిణామాన్ని మొత్తం ఓ వ్య‌క్తి వీడియో తీశాడు. ఆ వీడియోలో కారు డోరుకు తాడు క‌ట్టి.. దానిని కుక్క మెడ‌కు క‌ట్ట‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దానిని బ‌ల‌వంతంగా లాక్కొని వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో ఓ వ్య‌క్తి బైక్ పై వ‌చ్చి ఆ కారును నిలిపివేశాడు. డాక్ట‌ర్ చేస్తున్న ప‌నిని ప్ర‌శ్నించాడు. వెంట‌నే కుక్క‌ను ర‌క్షించి డాగ్ హోమ్ ఫౌండేష‌న్ కు సమాచారం అందించారు. అనంత‌రం ఆ ఫౌండేషన్ స‌భ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల‌కు స‌మాచారం అందించారు. డాక్ట‌ర్ గాల్వా చేసింది త‌ప్ప‌ని, ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్ల‌కుండా.. ఇంట్లో కూర్చొనే.. ఆన్‌లైన్‌లో 58 ఆర్‌టీఓ సేవలు

ఈ ఘ‌ట‌న‌లో కుక్కకు గాయాలు అయ్యాయి. అయితే ఈ విధి కుక్క తన ఇంటి సమీపంలో నివసిస్తుందని డాక్ట‌ర్ చెప్పారు. అందుకే దానిని అక్కడి  నుంచి తొల‌గించ‌డానికి తీసుకువెళ్తున్నానని డాక్ట‌ర్ గాల్వా చెప్పారు. ఆ డాక్ట‌ర్ పై జంతు హింస చ‌ట్టం కింద కేఏసు న‌మోదు చేశామ‌ని జోధ్‌పూర్ శాస్త్రిన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ఎస్ హెచ్ వో జోగేంద్ర సింగ్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios