ఓ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఆమెకు ఆ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త కొద్ది రోజులకు స్నేహంగా మారింది. స్నేహం ప్రేమగా మారింది. కొంత కాలంపాటు వారు ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి పలు ప్రాంతాల్లో షికార్లు కూడా చేశారు. ఆ సమయంలో ఇద్దరూ సన్నిహితంగా ఫోటోలు దిగారు. ఇప్పుడు ఆ ఫోటోలు చూపించి.. సదరు యువతిని ఆ యువకుడు బెదిరించడం గమనార్హం.

ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు కి చెందిన కార్తీ అనే యువకుడికి వాట్సాప్ గ్రూప్ లో అదే ప్రాంతానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొంతకాలానికి ప్రేమగా మారింది.

ఆ ప్రేమలో ఉన్న సమయంలో ఇద్దరూ పలు ప్రాంతాలు కలిసి తిరిగారు. అయితే.. అనుకోండా కార్తీలో వచ్చిన మార్పుని యువతికి నచ్చలేదు. దీంతో అతనిని దూరం పెట్టడం మొదలుపెట్టింది.

కార్తీ ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతుండగా... సదరు యువతి మాత్రం ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతోంది. అయితే.. యువతి తనను దూరం పెట్టడం మొదలుపెట్టడంతో కార్తీలో మృగం బయటకు లేచింది.

తనతో సెక్సువల్ రిలేషన్ షిప్ పెట్టుకోవాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడు. తనతో పడుకోవాలని ఆమెను బలవంతం చేశాడు. అందుకు యువతి అంగీకరించకపోవడంతో.. తనతో గతంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు.

అలా చేయకుండా ఉండాలంటే తనకు రూ.50వేలు ఇవ్వాలంటూ బెదిరించాడు. దీంతో.. యువతి తన దగ్గర ఉన్న రూ.15వేలు ఇచ్చింది. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో... బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.