పబ్ జీ గేమ్ పిచ్చి ఈ మధ్యకాలంలో యువతకు బాగా ఎక్కింది. పిచ్చిపట్టినట్లు దాని మాయలో పడిపోయి బయట ప్రపంచాన్ని మర్చిపోయి మరీ ఆడేస్తుంటారు. ఇప్పటికే  ఈ ఆట కారణంగా కొందరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా... ఓ యువకుడికి దీని వల్ల నిజంగానే పిచ్చి పట్టింది. అర్థనగ్నంగా రోడ్డుపై తిరుగుతూ కనిపించిన వాళ్లపై దాడులు చేస్తుండటం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Also Read తల్లీకొడుకులను పొడిచి చంపారు: మూడు రోజులుగా ఇంట్లోనే మృతదేహాలు...

పూర్తి వివరాల్లోకి వెళితే... పబ్‌ జీ గేమ్‌కు బానిసైన యువకుడు మానసిక అస్వస్థతతో అర్ధనగ్నంగా తిరుగుతూ రాళ్లతో దాడి చేసిన ఘటన విజయపుర పట్టణంలో జరిగింది. పబ్‌జీ గేమ్‌కు అలవాటు పడిన యువకుడు మంగళవారం విజయపుర పట్టణంలోని మనగోలి అగసి వద్ద అర్ధనగ్నంగా రోడ్డుపైకి వచ్చాడు. అనంతరం రాళ్లతో కార్లు, బైక్‌లపై దాడి చేశాడు. పబ్‌జీలో మాదిరిగా బాంబ్‌లు విసిరినట్లు గలాటా సృష్టించాడు. దీంతో మహిళలు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.